Border tension కేరళ, కర్నాటకల మధ్య కరోనా కలహం

|

Apr 01, 2020 | 4:18 PM

కరోనా డిస్ట్రబ్ చేయని రంగమంటూ లేని ప్రస్తుత పరిస్థితిలో తాజాగా రెండు రాష్ట్రాల మధ్య కలహానికి కరోనా వైరస్ కారణమైంది. చదవడానికి ఆశ్చర్యంగా వున్నా.. ఇది అక్షరాలా నిజం.

Border tension కేరళ, కర్నాటకల మధ్య కరోనా కలహం
Follow us on

Kerala complained against Karnataka over border closure: కరోనా డిస్ట్రబ్ చేయని రంగమంటూ లేని ప్రస్తుత పరిస్థితిలో తాజాగా రెండు రాష్ట్రాల మధ్య కలహానికి కరోనా వైరస్ కారణమైంది. చదవడానికి ఆశ్చర్యంగా వున్నా.. ఇది అక్షరాలా నిజం. కేరళ, కర్నాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదానికి తెరలేపింది కరోనా వైరస్..

కేరళ – కర్ణాటక రాష్ట్రాల బోర్డర్ విషయంలో పంచాయతీ మొదలైంది. కర్ణాటక నుండి కేరళ వెళ్లే మార్గాలను మట్టి గోడలతో మూసి వేశారు కర్నాటక పోలీసులు. కేరళ లోని కసర్ గోడ్‌కు మంగుళూరు నుండి రావాల్సిన మందులు, ఇతర సామగ్రి కర్నాటక బోర్డర్‌లో నిలిచిపోయాయి. అసలే కరోనా విజ‌ృంభించడంతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు రిజిస్టరైన కేరళ రాష్ట్రంలో నియంత్రణా చర్యలు శరవేగంగా తీసుకోవాల్సిన పరిస్థితి.

కర్నాటక బోర్డర్‌లో రోడ్లను మూసి వేయడంతో కేరళకు వైద్య పరికరాలు, కిట్లు చేరవేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో కర్నాటక ప్రభుత్వ చర్యలపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది కేరళ ప్రభుత్వం. బోర్డర్ల మధ్య సామాన్య రవాణాను నిలిపి వేసినప్పటికీ ఎమర్జెన్సీ వైద్య పరికరాలకు అనుమతి వుందని తెలిపింది కేరళ. ఈ విషయంలో కర్నాటన ప్రభుత్వ వైఖరిపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.

కేరళలోని కసర్ గోడ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో రికార్డయ్యాయి. దాంతో బోర్డర్‌లో వున్న కసర్ గోడ్‌కు రాకపోకలు కొనసాగితే కర్నాటక రాష్ట్రంలోను కరోనా విస్తరించే ప్రమాదం వుందన్న భయంతోనే కర్నాటక బోర్డర్‌లో కాస్త కఠినంగా వుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. రెడ్ జోన్‌లో వున్న కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు మెడికల్ కిట్లు త్వరితగతిన పంపాల్సిన అవసరం వుంది. ఈనేపథ్యంలో కేంద్రం జోక్యాన్ని కోరుతోంది కేరళ ప్రభుత్వం.