మహా రాజకీయాల్లో ట్విస్ట్.. సీఎంగా దేవేంద్ర..

| Edited By: Ram Naramaneni

Nov 23, 2019 | 4:37 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే.. రాజకీయాల్లో పరిణామాలు మారిపోయాయి. ఎన్సీపీలో చీలికతో మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడిచింది. శరద్ పవార్ అన్న కొడుకు.. అజిత్ పవార్ అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో.. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తానికి.. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 8 గంటలకు రాజ్ భవన్‌లో ఫడ్నవీస్‌చేత.. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అవడం […]

మహా రాజకీయాల్లో ట్విస్ట్.. సీఎంగా దేవేంద్ర..
Follow us on

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే.. రాజకీయాల్లో పరిణామాలు మారిపోయాయి. ఎన్సీపీలో చీలికతో మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడిచింది. శరద్ పవార్ అన్న కొడుకు.. అజిత్ పవార్ అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో.. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మొత్తానికి.. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 8 గంటలకు రాజ్ భవన్‌లో ఫడ్నవీస్‌చేత.. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అవడం ఇది రెండవసారి. అయితే.. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు.. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. శివసేన ప్రజా తీర్పును అవమానించిందన్నారు. మహారాష్ట్రకు స్థిరమైన ప్రభుత్వం కావాలి.. బలహీన ప్రభుత్వం కాదన్నారు. బీజేపీ-ఎన్సీపీ కలిసి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. స్థిరమైన ప్రభుత్వం కోసమే ఎన్సీపీ బీజేపీకి మద్దతిచ్చిందని పేర్కొన్నారు.