BJP strategy: స్థానిక సంస్థలకు బీజేపీ సూపర్ ప్లాన్

|

Feb 17, 2020 | 6:47 PM

ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహాన్ని ఖరారు చేసింది. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

BJP strategy: స్థానిక సంస్థలకు బీజేపీ సూపర్ ప్లాన్
Follow us on

AP BJP super action plan finalized for local bodies elections: ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థలపై ఫోకస్ చేశారు ఏపీ బీజేపీ నేతలు. ఇందుకోసం సోమవారం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేశారు.

విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు హాజరైన ఈ భేటీలో బీజేపీ, జనసేన పొత్తుపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఎలాంటి సందేశం పంపాలన్న దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు.

Also read: Siva temple coming out from river water

జనసేనతో పొత్తు కారణంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సీట్ల పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై గ్రౌండ్ లెవెల్‌లో కసరత్తు చేయాలని సూచించారు పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. మోడీ పాలన, కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై గ్రామాలలో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఎనిమిది నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలోని వైఫల్యాలు, పెన్షన్‌ల రద్దు వంటి అంశాలపై ప్రధానంగా ప్రజల్లో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు బీజేపీ నేతలు.

స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపునకు అవకాశం ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పిన నాయకులు.. ఎన్నికలపై నిర్లక్ష్యం తగదని జిల్లా స్థాయి నాయకులను హెచ్చరించారు.