Breaking news పాకిస్తాన్‌లో కూలిన విమానం

Flight crash near Karachi city in Pakisthan: పాకిస్తాన్‌లో కీలక నగరమైన కరాచీలో ఓ విమానం కుప్పకూలింది. కరాచీలోని నివాస ప్రాంతంలో విమానం కుప్పకూలిన విషయాన్ని అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది. ఈ విమానంలో మొత్తం 95 మంది ప్రయాణికులు వున్నారని, వారంతా మరణించి వుంటారని ప్రాథమిక సమాచారం అందుతోంది. అదే సమయంలో ఈ విమానం నివాస ప్రాంతంలో కూలడంతో అక్కడ కూడా ప్రాణనష్టం జరిగి వుండొచ్చని తెలుస్తోంది. ల్యాండిండ్ టైమ్‌లో విమానం కూలడంతో సమీపంలోని నివాస […]

Breaking news పాకిస్తాన్‌లో కూలిన విమానం

Updated on: May 22, 2020 | 6:26 PM

Flight crash near Karachi city in Pakisthan: పాకిస్తాన్‌లో కీలక నగరమైన కరాచీలో ఓ విమానం కుప్పకూలింది. కరాచీలోని నివాస ప్రాంతంలో విమానం కుప్పకూలిన విషయాన్ని అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది. ఈ విమానంలో మొత్తం 95 మంది ప్రయాణికులు వున్నారని, వారంతా మరణించి వుంటారని ప్రాథమిక సమాచారం అందుతోంది. అదే సమయంలో ఈ విమానం నివాస ప్రాంతంలో కూలడంతో అక్కడ కూడా ప్రాణనష్టం జరిగి వుండొచ్చని తెలుస్తోంది. ల్యాండిండ్ టైమ్‌లో విమానం కూలడంతో సమీపంలోని నివాస భవానాలు, అపార్ట్‌మెంట్లు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి.

కరాచీలోని మహ్మద్ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగకు సిద్దమవుతున్న తరుణంలో ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని ఉర్దూ మీడియా సంస్థ తెలిపింది. లాహోర్ నుంచి కరాచీ వస్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 95 మంది వున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం సమీపంలోని మోడల్ కాలనీలో విమానం కూలింది. ఈ ఏరియాలో భారీ సంఖ్యలో ప్రజలు నివసిస్తారని అంటున్నారు. విమానంలో వున్న 95 మంది సహా కూలిన ఏరియా నివాస ప్రాంతం కావడంతో మృతుల సంఖ్య వందకు పైగానే వుంటుందని భావిస్తున్నారు. విమానం కూలిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.