ప్రేమికులకు భజరంగ్ దళ్ గుడ్‌న్యూస్.. ఈ సారి పెళ్లిళ్లు చెయ్యం.. కానీ..!

| Edited By:

Feb 08, 2020 | 1:33 PM

ప్రేమికుల దినోత్సవం వస్తుందంటే చాలు.. ఓ వైపు ప్రేమికులు వారివారి ప్రియురాళ్లతో గడపాలని చూస్తుంటారు. కానీ అదే సమయంలో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్న సంస్థలతో భయబ్రాంతులకు గురవుతుంటారు. దీనికి కారణం.. ఈ వాలెంటైన్స్ డేను వ్యతిరేకించే సంస్థలు ప్రేమ జంటలు కనిపిస్తే చాలు.. పెళ్లిళ్ళు చేస్తామని హెచ్చిరకలు జారీ చేస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలు ప్రతిఏటా ఈ వాలెంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ.. పార్క్‌లు, పబ్బులు, రెస్టారెంట్ల […]

ప్రేమికులకు భజరంగ్ దళ్ గుడ్‌న్యూస్.. ఈ సారి పెళ్లిళ్లు చెయ్యం.. కానీ..!
Follow us on

ప్రేమికుల దినోత్సవం వస్తుందంటే చాలు.. ఓ వైపు ప్రేమికులు వారివారి ప్రియురాళ్లతో గడపాలని చూస్తుంటారు. కానీ అదే సమయంలో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్న సంస్థలతో భయబ్రాంతులకు గురవుతుంటారు. దీనికి కారణం.. ఈ వాలెంటైన్స్ డేను వ్యతిరేకించే సంస్థలు ప్రేమ జంటలు కనిపిస్తే చాలు.. పెళ్లిళ్ళు చేస్తామని హెచ్చిరకలు జారీ చేస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలు ప్రతిఏటా ఈ వాలెంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ.. పార్క్‌లు, పబ్బులు, రెస్టారెంట్ల వద్ద.. హల్ చల్ చేస్తుంటాయి. అయితే ఈ సారి ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పాయి ఈ సంస్థలు.

ఇక ఈ సారి ప్రేమికులు కనిపిస్తే పెళ్లిళ్లు చెయ్యమని పేర్కొన్నాయి. కానీ వారికి ప్రతిసారి ఇచ్చినట్లే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని తెలిపాయి. అదేసమయంలో గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా దాడికి గుర్తుగా.. ఆ ఘటనలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ.. పుల్వామా అమరవీరుల దినోత్సవంగా జరుపబోతున్నట్లు తెలిపారు. పార్కుల్లో, పబ్లుల్లో కనిపించే ప్రేమికుల చేత పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించేలా చేస్తామని.. ప్రతి పార్క్‌, పబ్ వద్ద పుల్వామా అమరవీరుల ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తామని భజరంగ్ దళ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ.. బ్యాన్ వాలెంటైన్స్ డే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.