బ్రేకింగ్: ప్రయాణికులకు షాక్.. ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు!

ఏపీలో బస్సు చార్జీలు పెరగనున్నాయి. నష్టాలను ఎదుర్కొంటున్న ఆర్టీసీని కాపాడటానికి బస్సు ఛార్జీలను పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు, మిగతా బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు పెంచనున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్టీసీ రూ .6735 కోట్ల నష్టాన్ని, రూ .600 నుంచి రూ .700 కోట్ల భారాన్ని మోస్తుందని పేర్ని నాని పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన […]

బ్రేకింగ్: ప్రయాణికులకు షాక్.. ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 07, 2019 | 8:13 PM

ఏపీలో బస్సు చార్జీలు పెరగనున్నాయి. నష్టాలను ఎదుర్కొంటున్న ఆర్టీసీని కాపాడటానికి బస్సు ఛార్జీలను పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు, మిగతా బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు పెంచనున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్టీసీ రూ .6735 కోట్ల నష్టాన్ని, రూ .600 నుంచి రూ .700 కోట్ల భారాన్ని మోస్తుందని పేర్ని నాని పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన నాని, ఆర్టీసీ సంవత్సరానికి రూ .1200 కోట్ల నష్టాన్ని భరిస్తుందని, సవరించిన ఛార్జీలను ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. కార్పొరేషన్‌ను కాపాడటానికి ప్రభుత్వం ఛార్జీలను పెంచినట్లు మంత్రి స్పష్టం చేశారు.