దేశంలో జరుగుతోన్న నేరాలపై.. జాతీయ నేర గణాంక సంస్థ సర్వే జరిపింది. 2017లో మహిళలపై చేసిన దాడులు, అన్ని రకాల నేరాలపై సర్వే చేయగా.. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆ నివేదికలు.. అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే నేరాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలవడం కలవరపరుస్తోంది. ఆఖరికి వృధ్ధులపై నేరాల్లో కూడా భారత దేశంలోనే.. ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. మహిళలపై అఘాయిత్యాల్లో.. ఏపీనే నెంబర్ వన్ అని అధికారులు చెబుతున్నారు.
ఏపీ రాష్ట్రంలో.. మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, దాడులతో.. దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన 2017 సర్వేలో.. పలు చేధు నిజాలు బయటకొచ్చాయి. దేశ వ్యాప్తంగా అన్ని రకాల నేరాలు కలిపి 30 లక్షల 62 వేల 579 కేసులు నమోదు కాగా.. వాటిలో.. లక్షా 32 వేల 336 నేరాలు మన రాష్ట్రంలోనే జరిగాయని అధికారిక లెక్కలు చెబుతోన్నాయి. అలాగే.. అన్ని రకాల నేరాల్లో.. దేశంలో.. 10వ స్థానంలో ఏపీ నిలిచింది. ఆర్థిక నేరాలు, మహిళలు, వృద్ధులు, ఆన్‌లైన్ మోసాలు ఇలా అన్ని నేరాల్లో ఏపీ 10 స్థానంలో నిలవడం.. అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలకు సంబంధించి 2017 నివేధిక ప్రకారం.. 988 కేసులు నమోదు కాగా.. వాటిలో 934 ఘటనల్లో పరిచయస్తులే నిందితులుగా ఉన్నారు. ఇందులో బాలలు కూడా ఎక్కువగా ఉన్నారు. కాగా.. వివాహేతర సంబంధాలతో.. రాష్ట్రంలో 178 హత్యలు జరగ్గా.. అసలు ఏ కారణం లేకుండానే 55 హత్యలు జరిగాయని నివేదిక వెల్లడించింది. అలాగే.. 2017లో ఏపీలో లక్షా 32వేల 660 నేరాలకు.. లక్షా 31 వేల 660 మంది అరెస్ట్ కాగా.. వారిలో లక్షా 17 వేల 742 మంది తొలిసారి తప్పు చేసి అరెస్ట్ అయిన వారి సంఖ్యనే ఎక్కువ. పలు రకాల హత్యలు, మోసాలకు పాల్పడం, బెదిరింపులు, లైంగిక వేధింపులు, సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక కేవలం.. కేసు నమోదు అయినవారివి మాత్రమే. ఇంకా చట్టానికి చిక్కకుండా.. తిరుగుతున్న వారు చాలా మందినే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ నేరాలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించినప్పుడు మాత్రమే.. నేరాలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.