మోడీపై ఏపీ మంత్రులు ఆగ్రహం

విజయవాడ: ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపధ్యంలో ఏపీ మంత్రులు దేవినేని ఉమా, యనమల రామకృష్ణ విమర్శలు చేశారు. ఏపీ ప్రజలను ప్రధాని మోడీ నమ్మించి మోసం చేశారని దేవినేని ఉమా అన్నారు. హోదా, రాజధాని, పోలవరం, విభజన హామీలను తుంగలో తొక్కారు. ప్రజలను మోసం చేసేందుకే రైల్వే జోన్ ప్రకటన చేశారని ఉమా మండిపడ్డారు. రైల్వే జోన్ ప్రకటనపై బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. ఆదాయం లేని రైల్వే జోన్‌ను ఏపీకి ఇచ్చారు. అన్యాయం […]

మోడీపై ఏపీ మంత్రులు ఆగ్రహం

Updated on: Mar 01, 2019 | 3:22 PM

విజయవాడ: ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపధ్యంలో ఏపీ మంత్రులు దేవినేని ఉమా, యనమల రామకృష్ణ విమర్శలు చేశారు. ఏపీ ప్రజలను ప్రధాని మోడీ నమ్మించి మోసం చేశారని దేవినేని ఉమా అన్నారు. హోదా, రాజధాని, పోలవరం, విభజన హామీలను తుంగలో తొక్కారు. ప్రజలను మోసం చేసేందుకే రైల్వే జోన్ ప్రకటన చేశారని ఉమా మండిపడ్డారు. రైల్వే జోన్ ప్రకటనపై బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. ఆదాయం లేని రైల్వే జోన్‌ను ఏపీకి ఇచ్చారు. అన్యాయం చేసిన మోడీకి ఏపీలో పర్యటించే హక్కులేదని దేవినేని ఉమా ఫైరయ్యారు.

మంత్రి యనమల మాట్లాడుతూ బీజేపీ అంటేనే నమ్మక ద్రోహ పార్టీ అన్నారు. మోడీ నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం, మోసానికి ప్రతిరూపం అన్నారు. గెజిట్‌లో విభజన చట్టాన్ని ప్రకటించి ఐదేళ్లయ్యింది. విభజన చట్టాన్ని ఎంతవరకు అమలు చేశారో జాతికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని మంత్రి యనమల అన్నారు.