ఏపీ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ బదిలీ

|

Mar 29, 2019 | 3:18 PM

అమరావతి: ఏపీ ఇంటలిజెన్స్ డీజీ వెంకటేశ్వరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను హెడ్ క్వార్టర్స్‌కు ఎటాచ్ చేసింది. ఆయన స్థానంలో మరో సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని..  డీజీపీ ఆఫీస్‌లో వెంటనే రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం కోరింది. వెంకటేశ్వరరావుకు ఎన్నికలకు సంబంధించిన ఏ రకమైన విధులను అప్పగించకూడదని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఐపీఎస్‌ బదిలీల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం […]

ఏపీ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ బదిలీ
Follow us on

అమరావతి: ఏపీ ఇంటలిజెన్స్ డీజీ వెంకటేశ్వరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను హెడ్ క్వార్టర్స్‌కు ఎటాచ్ చేసింది. ఆయన స్థానంలో మరో సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని..  డీజీపీ ఆఫీస్‌లో వెంటనే రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం కోరింది. వెంకటేశ్వరరావుకు ఎన్నికలకు సంబంధించిన ఏ రకమైన విధులను అప్పగించకూడదని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఐపీఎస్‌ బదిలీల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఐబీ చీఫ్‌తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసీ తీరుపై మండిపడిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధులతో ఐబీ చీఫ్‌కు సంబంధం లేదని పేర్కొంటూ ఆయన బదిలీని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో డీజీని ప్రభుత్వం బదిలీ చేసింది.