AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) చైర్మన్ వెంకటరామిరెడ్డి తెలిపారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ కు అనుగుణంగా వచ్చే జనవరి నేఅల నుంచి డీఏను జమ చేస్తారని ఆయన చెప్పారు. ఎన్నాళ్లగానో డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్న ఉద్యోగులకు డీఏ బకాయిలను విడుదల చేసి కాస్త ఊరట కల్పించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై ఒకటి నుంచి డీఏ బకాయిలను ఆర్దికశాఖ విడుదల చేయడానికి ఉత్తర్వులిచ్చింది. ఆ నెలకు 5.24 శాతం డీఏ బకాయిలు విడుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
(ఇది ఇప్పుడే అందిన సమాచారం. విషయం ముందుగా రీడర్స్ కి చేరడం కోసం ఇవ్వడం జరిగింది. మరిన్ని విశేషాలు అప్ డేట్ అవుతాయి.. చూస్తూనే ఉండండి)
ఇవి కూడా చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వాయిదా పడనున్న మెగావేలం.. ఎందుకంటే?
Stock Market: ఒమిక్రాన్ భయాలతో స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.6,81,0000 కోట్ల మదుపర్ల సందప ఆవిరి
Jaya Bachchan: కోడలికి ఈడీ సమన్లు.. రాజ్యసభలో బీజేపీకి జయాబచ్చన్ శాపనార్థాలు