నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ పిటిష‌న్ పై విచార‌ణ‌…హైకోర్టు ఏం చెప్పిందంటే

|

Apr 13, 2020 | 2:26 PM

ఏపీ ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయలో దాఖలైన పిటీషన్లపై ఏపీ హైకోర్ట్ విచారణ జరిపిపింది.మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై వాదనలు కొనసాగాయి. మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరుపున సీనియర్ న్యాయవాదులు డి.వి.సీతారాంమూర్తి, అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాను ఎదుర్కొనే నిర్ణయాలలో ఉంటే ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ తొలగింపు విషయంలో తీసుకొచ్చిన […]

నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ పిటిష‌న్ పై విచార‌ణ‌...హైకోర్టు ఏం చెప్పిందంటే
Follow us on

ఏపీ ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయలో దాఖలైన పిటీషన్లపై ఏపీ హైకోర్ట్ విచారణ జరిపిపింది.మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై వాదనలు కొనసాగాయి. మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరుపున సీనియర్ న్యాయవాదులు డి.వి.సీతారాంమూర్తి, అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాను ఎదుర్కొనే నిర్ణయాలలో ఉంటే ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ తొలగింపు విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిర్ణయం చట్ట విరుద్ధం మని సీనియర్ న్యాయవాదులు సీతారంమూర్తి, అశ్వనీకుమార్ లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం అసెంబ్లీ పెట్టలేని పరిస్థితుల్లో మాత్రమే ప్రజలకు కవాల్సిన ముఖ్య అంశాలపై ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్డినెన్స్ జారీ చేస్తారు తప్పా ఇలాంటి ఆర్డినెన్స్ లు ఈ సమయంలో తీసుకురావడం చట్టవిరుద్దం అని సీజే ఎదుట వాదనలు వినిపించారు.

అనంతరం సీనియర్ నాయవాదలు సీతారంమూర్తి, అశ్శనీకుమార్ లు వినిపించిన వాదనలు మీద సరైన సమాధానం చెప్పకుండానే ఏజీ రాష్ట్ర ఎన్నికల కమీషన్ విషయంలో ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే అర్హత ఉందంటూ కౌంటర్ వాదనలు వినిపించే ప్రయత్నం చేసారు. కానీ చీఫ్ జస్టీస్ అందుకు ఏజీ వాదనలతో ఏకీభవించలేదు. ఏజీ సరైన సమాధానం చెప్పకుండా దాట వేయడంతో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగింపు విషయం, పదవీ కాలం తగ్గింపు అంశాలు, జీవో నెంబర్ 617 మీద పూర్తి క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వానికి సీజే ఆదేశాలిచ్చారు. ఏజీ నాలుగు వారాలు గడువు కావాలని కోరగా, నాలుగు వారాలు కాదు 16వ తారీఖుకల్లా సమాధానం కావాలని ఏపీ ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ మహేశ్వరీ కోరారు. ఐతే 17న ప్రభుత్వం ఇచ్చిన సమాధానం బట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. మరోపక్క ప్రస్తుతం ఏపీ ఎన్నికల కమీషనర్ గా నియమితులైన కనగరాజ్ ను కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని సీనియర్ అడ్వకేట్ సీతారాంమూర్తి, అశ్వనీకుమార్లు సీజేను కోరారు. దీనికి కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూస్తామని సీజే తెలిపారు.