తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇద్దరు సీఎంలు

|

Sep 12, 2020 | 11:58 AM

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప హాజరుకానున్నారు.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇద్దరు సీఎంలు
Follow us on

 Tirumala Srivari Brahmotsavam : ఇద్దరు సీఎం ఒకే రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప హాజరుకానున్నారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు పాటు తిరుమలలోనే సీఎం వైఎస్ జగన్ ఉండనున్నారు. 23వ తేది సాయంత్రం తిరుమలకు సీఎం చేరుకోనున్నారు.  24న ఉదయం జగన్.. శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తూన్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం కర్నాటక అతిధి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇద్దరు సీఎంలూ పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహంకు చేరుకోని అల్పాహారం స్వీకరించి సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.