వలస కార్మికుల వెతలపై అమిత్ షా రివ్యూ.. నిత్యావసరాలపై ఫోకస్

దేశంలో రెండో విడత లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హోమ్  మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వారికి నిత్యావసరాల సరఫరా తదితర అంశాలపై రాష్టాల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ను, రిపోర్టులను ప్రధాని కార్యాలయానికి పంపారు.

వలస కార్మికుల వెతలపై అమిత్ షా రివ్యూ.. నిత్యావసరాలపై ఫోకస్

Edited By:

Updated on: Apr 19, 2020 | 12:48 PM

దేశంలో రెండో విడత లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హోమ్  మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వారికి నిత్యావసరాల సరఫరా తదితర అంశాలపై రాష్టాల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ను, రిపోర్టులను ప్రధాని కార్యాలయానికి పంపారు. ఈ సమావేశంలో మంత్రులు జి.కిషన్ రెడ్డి, నిత్యానంద రాయ్, హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో వలస జీవుల వల్ల తలెత్తిన పరిస్థితిని, వారికి షెల్టర్లు కల్పించడానికి ఆయా ప్రభుత్వాలు చేసిన ఏర్పాట్లను అధికారులు అమిత్ షాకు వివరించారు. ఈ షెల్టర్ల కెపాసిటీని పెంచడానికి హోమ్ శాఖ తీసుకున్న చర్యలను కూడా వారు తెలియజేశారు. లాక్ డౌన్ విధింపు, వలస కార్మికుల అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ‘కోవిడ్-19 వార్ రూమ్’ కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో 36 హెల్ప్ లైన్లు ఉన్నాయి. వీటికి ఫోన్ చేసి  ఎవరైనా తమ సమస్యలను తెలియజేయవచ్చు.