AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంగోలు దగ్గరి బీచ్‌లో చైనీస్ సిలిండర్.. భయంలో జనం

చైనా నుంచి సముద్రంలో కొట్టుకొచ్చిన ఓ వస్తువు ఏపీ తీరప్రాంతంలో భయాందోళన సృష్టించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి సమీపంలోని ఓ బీచ్‌లో ఈ చైనా వస్తువు కలకలం సృష్టించింది. అదేంటో తేల్చేందుకు మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు.

ఒంగోలు దగ్గరి బీచ్‌లో చైనీస్ సిలిండర్.. భయంలో జనం
Rajesh Sharma
|

Updated on: Apr 19, 2020 | 5:35 PM

Share

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ సముద్ర తీరంలోని బీచ్‌లోకి ఓ సిలిండర్‌ ఆకారంలో ఉన్న వస్తువు కొట్టుకొచ్చింది. ఈ వస్తువు చైనాది కావడంతో బీచ్ సమీప ప్రాంతంలో నివసించే జనం భయాందోళనతో బెంబేలెత్తిపోయారు. ఈ సిలిండర్‌ ఆకారపు వస్తువుపై చైనా లిపిలో అక్షరాలు ఉండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు వస్తువును పరిశీలించి అగ్నిమాపక యంత్రంగా నిర్ధారించారు. కాని ఇది ఇక్కడికి ఎలా వచ్చింది, దేనికి సంబంధించినదో విచారణలో తేలాల్సి ఉందంటున్నారు. ఈ వస్తువు గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఉపయోగించే యంత్రంగా గుర్తించినట్టు మెరైన్ ఏఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.

అనంతరం గ్రామ విఆర్‌ఓకు ఆ వస్తువుని అప్పగించారు. కొట్టుకొచ్చిన వస్తువుపై చైనా బాష ఉండటం, తరచూ ఇటువంటి గుర్తుతెలియని వస్తువులు సముద్రంలో కొట్టుకు రావడం పట్ల తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్