AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియన్ టెక్కీలకు అమెరికా షాక్.. ఈసారి ఏం చేసిందంటే ?

భారత టెక్కీల కలలను కల్లలు చేస్తోంది అగ్రరాజ్యం. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయాలనే యువత ఆశలపై నీళ్లు చల్లుతోంది.  హెచ్‌ 1 బీతో పాటు ఎల్‌ 1 వీసా దరఖాస్తులను భారీగా తిరస్కరిస్తోంది. ఇది ఈ ఏడాది మూడో త్రైమాసికంలో  4 రెట్లు పెరిగింది. వీటిలో 90 శాతానికి పైగా భారతీయులకు చెందిన వీసాలే తిరస్కరణకు గురవుతున్నాయి. భారత ఐటీ నిపుణుల ఆశలను ఆవిరి చేస్తోంది డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌.  స్థానికులకే ఉద్యోగావకాశాలు అన్న అమెరికా అధ్యక్షుని […]

ఇండియన్ టెక్కీలకు అమెరికా షాక్.. ఈసారి ఏం చేసిందంటే ?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 06, 2019 | 7:16 PM

Share
భారత టెక్కీల కలలను కల్లలు చేస్తోంది అగ్రరాజ్యం. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయాలనే యువత ఆశలపై నీళ్లు చల్లుతోంది.  హెచ్‌ 1 బీతో పాటు ఎల్‌ 1 వీసా దరఖాస్తులను భారీగా తిరస్కరిస్తోంది. ఇది ఈ ఏడాది మూడో త్రైమాసికంలో  4 రెట్లు పెరిగింది. వీటిలో 90 శాతానికి పైగా భారతీయులకు చెందిన వీసాలే తిరస్కరణకు గురవుతున్నాయి.
భారత ఐటీ నిపుణుల ఆశలను ఆవిరి చేస్తోంది డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌.  స్థానికులకే ఉద్యోగావకాశాలు అన్న అమెరికా అధ్యక్షుని నినాదం భారతీయ సాంకేతిక నిపుణులతో పాటు స్వదేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు శాపంగా పరిణమిస్తోంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక హెచ్‌ 1 బీ వీసాల తిరస్కరణ రేటు 6 నుంచి 24 శాతానికి పెరిగింది.
హెచ్‌ 1 బీ వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు ఈ ఆర్థిక సంవత్సరం థర్డ్‌ క్వార్టర్‌లో 4 రెట్లు పెరిగింది. వీటిలో 90శాతానికి పైగా భారతీయులకు చెందినవే. ఇక భారతీయ కంపెనీల దరఖాస్తులు కనిష్టంగా 37 నుంచి గరిష్టంగా 62 శాతం తిరస్కరణకు గురయ్యాయి. టెక్ మహీంద్రా 41 శాతం, టాటా కన్సల్టెన్సీ  34 శాతం, విప్రో 53 శాతం, ఇన్ఫోసిస్‌కు చెందిన 45 శాతం వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికమైన తిరస్కరణ అని ఓ అధ్యయనంలో తేలింది.
భారతీయ కంపెనీలకు షాకిస్తున్న యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ సిటిజన్‌ పాలసీ (యూఎస్‌సీఐఎస్‌) అమెరికన్‌ కంపెనీల వీసాలకు మాత్రం ఆమోద ముద్ర వేస్తోంది. యాపిల్‌, ఫేస్‌బుక్‌లు సమర్పించిన 99శాతం దరశాస్తులకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. అలాగే గూగుల్‌ 2 శాతం, మైక్రోసాఫ్ట్‌ 5 శాతం, అమెజాన్‌ 3 శాతం, ఇంటెల్‌ 8 శాతం హెచ్‌1బీ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
ఇవి సమర్పించిన హెచ్‌1బీ దరఖాస్తుల్లో 67 శాతం భారతీయులవే కాగా వాటిలో 65 శాతం దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఈ కంపెనీలు సమర్పించిన రెన్యువల్‌ హెచ్‌1బీ దరఖాస్తుల ఆమోదం కూడా కనిష్టంగా 91 శాతం, గరిష్టంగా 98 శాతంగా ఉంది. అదే భారతీయ కంపెనీల దగ్గరకు వచ్చే సరికి ఆమోదం పొందిన  దరఖాస్తులు 82 శాతం మాత్రమే.
ఇక హెచ్‌ 1బీ వీసాల పరిస్థితి ఇలా ఉంటే ఎల్‌ 1 వీసాలను కూడా కట్టడి చేస్తోంది అగ్రరాజ్యం. దీంతో ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయి నానా అవస్థలు పడుతున్నాయి భారతీయ ఐటీ కంపెనీలు.  భారీగా వీసాల తిరస్కరణకు నిబంధనలు కఠినతరం చేయడమే కారణమని అధ్యయనం వివరించింది. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే..ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని భారతీయ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది నాస్కామ్‌.