హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఇక సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా వీరిలో సినీ నటుడు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు.