బెంగళూరు: కొన్ని రోజులుగా నాటకీయ పరిణామాల మధ్య సాగుతున్న కర్ణటక రాజకీయాలు ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక విధాన సభలో నేడు బల పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వానికి కాస్త ఉపశమనం అభించింది. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఈయన కీలకంగా మారిన నేపథ్యంలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ఈ రూపంలో కాస్త ఊరట లభించింది. సంకీర్ణ ప్రభుత్వానికే మద్దతిస్తానని రామలింగారెడ్డి కూడా ప్రకటించారు. ఇక ఈ ఉదయం 11గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. ఈ చర్చల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.