Breaking: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృత్యువాత

|

Mar 21, 2020 | 12:14 PM

తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున పేలుళ్ళు చోటుచేసుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. బాణాసంచా ఫ్యాక్టరీ దగ్ఢమైంది. తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు.

Breaking: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృత్యువాత
Follow us on

Fire accident in fireworks factory: తమిళనాడులోని విరుధ్ నగర్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. శనివారం ఉదయం బాణాసంచా తయారీ ప్లాంటులో అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. బాణా సంచా తయారు చేస్తున్న కార్మికుల్లో తొమ్మిది మంది అగ్ని కీలల్లో తగులబడిపోయారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బాణాసంచా స్టాక్స్‌లో ఉన్నట్లుండి నిప్పు రాజుకోవడంతో పెద్ద ఎత్తున శబ్ధాలతో పేలుళ్ళు సంభవించినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలో మొత్తం 26 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. వారిలో 9 మంది దుర్మరణం పాలు కాగా.. ఏడుగురు గాయపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. మరికొంత మంది మరణించి వుంటారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.