
Coronavirus In AP: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఏపీలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిద్-19 పరీక్షల్లో మరో57 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,339కి చేరింది. వీరిలో 691మంది చికిత్స పొందుతుండగా.. 1,596మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 52 మంది మృతి చెందారు.
Also Read: గుడ్ న్యూస్: కరోనాపై పోరులో మరో ముందడుగు.. ట్రయల్స్ సక్సెస్!