ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. అన్‌లాక్ 1.0 తర్వాత రాష్ట్రంలో వందల్లో ఉన్న కేసులు వేలల్లోకి చేరాయి. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 1,264 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,099కి చేరింది. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,025 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 13,749 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం నాడు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 45, 720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షల మార్క్‌ను దాటేసింది.
Odisha detects 1,264 new #COVID19 cases today, taking the total number of positive cases in the state to 21,099 including 7,205 active cases and 13,749 recoveries: State Health Department
— ANI (@ANI) July 23, 2020