25వేలు కట్టలేకపోయాం.. అందుకే సినిమాల్లోకి వచ్చా

| Edited By:

Nov 08, 2020 | 9:18 AM

భారత సినీ పరిశ్రమ గర్వించదగ్గ హీరోలలో సూర్య కూడా ఒకరు. కోలీవుడ్ నటుడే అయినప్పటికీ.. టాలీవుడ్‌ హీరోలకు సమానంగా ఇక్కడ అభిమానులను సంపాదించుకున్నారు

25వేలు కట్టలేకపోయాం.. అందుకే సినిమాల్లోకి వచ్చా
Follow us on

Suriya about Cine Entry: భారత సినీ పరిశ్రమ గర్వించదగ్గ హీరోలలో సూర్య కూడా ఒకరు. కోలీవుడ్ నటుడే అయినప్పటికీ.. టాలీవుడ్‌ హీరోలకు సమానంగా ఇక్కడ అభిమానులను సంపాదించుకున్నారు ఈ వైవిధ్య నటుడు. అయితే మూవీల్లోకి రాకముందు ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసిన సూర్య.. సడన్‌గా సినీ ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాన్ని ఇటీవల రివీల్ చేశారు. డబ్బు కోసమే ఇండస్ట్రీకి వచ్చినట్లు ఈ నటుడు తెలిపారు. ( Bigg Boss 4: కలిసిపోయిన మోనాల్‌-అఖిల్‌.. అసలు రీజన్ చెప్పిన అఖిల్‌)

మూవీలోకి రాకముందు ఒకానొక సమయంలో మా కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. అప్పుగా తీసుకున్న రూ.25వేలను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నాం. ఇంటి పెద్ద కొడుకుగా నా తండ్రికి సాయం చేయాలనుకున్నా. అందుకే డబ్బుల కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. నా తొలి సినిమాకు రూ.50వేల రెమ్యునరేషన్ ఇచ్చారు అని సూర్య తెలిపారు. (Bigg Boss 4: ఇమ్యూనిటీ పొందిన అవినాష్‌.. మోనాల్‌కి షాక్‌)

కాగా 1995లో వసంత్ తీసిన ఆశ మూవీలో హీరోగా సూర్యకు అవకాశం వచ్చింది. కానీ సినీ ఇండస్ట్రీపై అంతగా ఆసక్తిలేకపోవడంతో ఆ ఆఫర్‌ని వదులుకున్నారు. ఆ తరువాత 1997లో మణిరత్నం నిర్మించిన నెర్రుక్కు నెర్ ద్వారా సూర్య హీరోగా ఎంట్రీ ఇచ్చారు. బాలా తెరకెక్కించిన నందా సూర్య కెరీర్‌కి మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. అంతేకాదు ఓ ఎన్జీవోను స్థాపించి సామాజిక సేవను చేస్తున్నారు. ఇదిలా ఉంటే సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా) నవంబర్ 12న అమెజాన్‌లో విడుదల కానుంది. ( Bigg Boss 4: హారికను సేఫ్‌ చేసిన కమల్‌