AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కంటెస్టెంట్ కు సుదీప్ సాయం… నేరుగా టికెట్ టు ఫినాలే … ఎక్కువ సార్లు నామినేట్ అయినందుకేనా…

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 షోకు సమంత అక్కినేని, అఖిల్, కార్తికేయ, సుమ ఇలా చాలా మంది సెలబ్రెటీలు వచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ షోకు వచ్చాడు. అయితే ఆయన వచ్చింది ఒక పని మీద అట. అదేంటంటే....

ఆ కంటెస్టెంట్ కు సుదీప్ సాయం... నేరుగా టికెట్ టు ఫినాలే ... ఎక్కువ సార్లు నామినేట్ అయినందుకేనా...
uppula Raju
| Edited By: |

Updated on: Nov 29, 2020 | 9:58 PM

Share

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 షోకు సమంత అక్కినేని, అఖిల్, కార్తికేయ, సుమ ఇలా చాలా మంది సెలబ్రెటీలు వచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ షోకు వచ్చాడు. అయితే ఆయన వచ్చింది ఒక పని మీద అట. అదేంటంటే….

సుదీప్‌ను బిగ్ బాస్ 4 ఈ షోకు పిలవడానికి ప్రత్యేకంగా కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటంటే ప్రస్తుతం ఉన్న హౌజ్‌మేట్స్‌లో ఒకర్ని నేరుగా ఫైనల్‌కు పంపించడం. ఆ బాధ్యతను సుదీప్‌పై పెట్టారట నాగార్జున. ప్రస్తుతం ఇంట్లో అవినాష్, అరియానా, అఖిల్, హారిక, మోనాల్, అభిజీత్ ఉన్నారు. అందులో ఈ వారం నామినేషన్స్ నుంచి అఖిల్, మోనాల్ సేవ్ అయ్యారు. అవినాష్, అరియానా డేంజర్ జోన్‌లో ఉండి బయటపడనున్నారు. అవినాష్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుదీప్ మాత్రం ఇంట్లో ఓ సభ్యుడికి వే టూ ది ఫినాలే కార్డ్ ఇచ్చినట్లు సమాచారం.

ఎక్కువ సార్లు నామినేట్ అయినందుకే…

అభిజిత్ కు సుదీప్ టికెట్ టు ఫినాలే కార్డు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎక్కువసార్లు నామినేట్ అయిన కారణంగానే అభిజిత్ కు ఈ టికెట్ లభించినట్లు తెలుస్తోంది. అయితే చాలా సార్లు నామినేట్ అయి సేవ్ అయ్యాడంటే అభి ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో అర్థమవుతుంది. షో వేదికగా అభిజిత్ ఆటను సుదీప్ పొగిడినట్లు తెలుస్తోంది. అభి మంచి బ్యాలెన్సింగ్‌గా గేమ్ ఆడుతున్నాడని సుదీప్ అన్నట్లు సమాచారం. కాగా, కన్నడ బిగ్ బాస్ షోను సుదీప్ ఏడు సీజన్లుగా విజయవంతంగా హోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సుదీప్ నటిస్తున్న కన్నడ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!