Bigg Boss4: దేవికి షాకిచ్చిన కరాటే కళ్యాణి

రెండోవారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణిని నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు టాస్క్‌ ఇచ్చారు.

Bigg Boss4: దేవికి షాకిచ్చిన కరాటే కళ్యాణి

Edited By:

Updated on: Sep 21, 2020 | 7:58 AM

Karate Kalyani- Devi Nagavvali: రెండోవారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణిని నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు టాస్క్‌ ఇచ్చారు. ఒక బోర్డుపై టాప్‌-5, బాటమ్‌-5 బ్లాక్‌లను ఇచ్చి.. కంటెస్టెంట్‌ల ఫొటోలన్నీ టేబుల్‌పై పెట్టారు. ఆ ఫొటోలను వాటిలో అమర్చాలని, కారణం కూడా చెప్పాలని నాగ్, కళ్యాణికి సూచించారు.

దీంతో బాటమ్‌ 5లో సోహైల్‌, సుజాత, అరియానా గ్లోరీ, కుమార్ సాయి గంగవ్వ ఫొటోలను పెట్టిన కళ్యాణి కారణాలను కూడా చెప్పారు. అయితే ఈ ఐదుగురు హౌజ్‌లో నిన్న జీరో అన్న వాళ్లేనని నాగార్జున పంచ్ వేశారు. ఇక టాప్‌ 5లో దేత్తడి హారిక, అమ్మ రాజశేఖర్‌, మోనాల్‌, దివి, అభిజిత్‌ ఫొటోలను కళ్యాణి పెట్టారు.

అయితే వెళ్తూ వెళ్తూ దేవికి షాక్ ఇచ్చింది. నాగార్జున ఇచ్చిన బిగ్‌బాంబ్‌ని దేవీ నాగవల్లిపై వేశారు. అంటే మూడో వారం నామినేషన్‌కి దేవిని అప్పుడే నామినేట్ చేశారు కళ్యాణి.

Read more:

Bigg Boss 4: బాలయ్య పాటకు గంగవ్వ అదిరిపోయే స్టెప్పులు

Bigg Boss 4: ఎలిమినేట్ అయిన హారిక.. ఊహించని ట్విస్ట్‌