Bigg Boss 4: ఎలిమినేట్ అయిన హారిక.. ఊహించని ట్విస్ట్‌

బిగ్‌బాస్‌ రెండో వారం వీకెండ్‌ ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చారు వ్యాఖ్యాత నాగార్జున. శనివారం ఎపిసోడ్‌లో ఈ వారం

Bigg Boss 4: ఎలిమినేట్ అయిన హారిక.. ఊహించని ట్విస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2020 | 7:47 AM

Bigg Boss 4 Harika: బిగ్‌బాస్‌ రెండో వారం వీకెండ్‌ ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చారు వ్యాఖ్యాత నాగార్జున. శనివారం ఎపిసోడ్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పిన నాగ్‌.. మొదటగా కరాటే కళ్యాణిని ఎంపిక చేశారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఆమెను ఇంటికి పంపారు. ఇక నామినేట్ అయిన మిగిలిన వారిలో దేత్తటి హారిక ఎలిమినేట్ అవుతున్నట్లు వెల్లడించారు. దీంతో అటు హౌజ్ సభ్యులకు, ఇటు ప్రేక్షకులకు షాక్‌కి గురయ్యారు. ఈ వారం అమ్మ రాజశేఖర్‌, కుమార్ సాయి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని భావించినప్పటికీ.. చివరకు హారిక పేరును నాగ్ అనౌన్స్ చేశారు.

దీంతో హౌజ్‌లోని కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక హారిక తన లగేజీని తీసుకొని తన దేత్తడి స్టెప్పులు వేసుకుంటూ గేటు వరకు వెళ్లింది. అయితే అప్పుడే నాగ్ మరో ట్విస్ట్ ఇచ్చారు. హారిక గేట్ దగ్గరకు వెళ్లగానే నాగ్ వెనక్కి పిలిచారు. దీంతో అందరూ మరోసారి షాక్‌కి గురయ్యారు. హారిక నామినేషన్లను సిల్లీగా తీసుకున్నందుకే తాను ఇలా చేయాల్సి వచ్చిందని, మళ్లీ హారికను హౌజ్‌లోకి వెళ్లమని చెప్పారు. దీంతో హౌజ్ సభ్యులు, ఇటు హారిక అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి వీకెంట్‌ ఎపిసోడ్‌లో అదిరిపోయే ఫన్‌, ట్విస్ట్‌తో నాగార్జున రాక్ చేశారు.

Read More:

దేశంలో 60 శాతం విద్యార్ధులు కాలినడకనే స్కూళ్లకు.. ఎన్ఎస్ఓ సర్వే

బ్రేకింగ్: కుప్పకూలిన మూడు అంతస్థుల భవనం.. 8 మంది మృతి