Bigg Boss 4 Telugu: మొదటివారం సోసోగానే స్టార్ అయినా.. లాక్‌డౌన్ ప్రభావం, కరోనా కారణంగా వీక్షకులు ఎంటర్‌టైన్మెంట్‌కు కరువైపోవడంతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 దేశవ్యాప్తంగా మంచి టీఆర్పీ రేటింగ్స‌్‌ను సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షోకు మొదటి వారం రికార్డు స్థాయిలో 18.5 టీఆర్పీ రేటింగ్ లభించడం విశేషం. (ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..)
కంటెస్టెంట్లు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. చాలా నెలలుగా ప్రేక్షకులు వినోదానికి దూరం కావడంతో అందరూ కూడా బిగ్ బాస్‌కే ఓటు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు ఈ షోను చూశారని స్వయంగా నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోలిస్తే.. తాజా సీజన్ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. (కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!)
అయితే ఇటీవల ప్రారంభమైన ఐపీఎల్ 2020 టోర్నమెంట్ బిగ్ బాస్‌పై భారీ ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. మొదటి వారం హయ్యస్ట్ టీఆర్ఫీ రేటింగ్‌తో దూసుకుపోయిన బిగ్ బాస్ షో.. మూడో వారం చేరుకునేసరికి సీరియల్స్ కంటే వెనుకబడింది. పొట్టి క్రికెట్ ఫార్మాట్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతుండటమే కాకుండా.. మిగతా భాషల్లో కూడా బిగ్ బాస్ కొత్త సీజన్లు స్టార్ట్ అవుతుండటంతో తెలుగు బిగ్ బాస్ 4కు అనుకోని రూపంలో బిగ్ షాక్ తగిలింది. మరి వీటి నుంచి తప్పించుకోవడానికి షో నిర్వాహకులు ఎలాంటి ప్లాన్లు వేస్తారో వేచి చూడాలి. (సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..)