Monal Akhil Abhijeet: బిగ్‌బాస్ 4 హౌజ్‌లో అభిజిత్, మోనాల్ గత కొన్ని రోజులుగా మాట్లాడుకోని విషయం తెలిసిందే. వీరిద్దరిని మళ్లీ మాట్లాడించేందుకు పలువురు కంటెస్టెంట్‌లు ప్రయత్నాలు చేశారు. అయితే అభి మాత్రం మాట్లాడేందుకు మోనాల్‌తో మాట్లాడేందుకు పెద్ద ఆసక్తిని చూపడం లేదు. ఇక తనపై అభి అంతలా ద్వేషం పెంచుకోవడానికి మెహబూబ్ కారణమంటూ సోమవారం నాటి ఎపిసోడ్‌లో అతడిని మోనాల్ ఎలిమినేషన్‌కి నామినేట్ చేసింది. తాను చెప్పిన దాన్ని 50 రెట్లు ఎక్కువ చేసి మెహబూబ్ చెప్పాడని మోనాల్ చెప్పింది. ( Bigg Boss 4: అఖిల్ ముందే అవినాష్‌కి మోనాల్ ముద్దు.. రచ్చ చేసిన కమెడియన్)
ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ”నువ్వు పర్మిషన్ ఇస్తే అభిజీత్‌తో నేను మాట్లాడతా” అని అఖిల్, మోనాల్‌ని అడిగాడు. దీనికి మోనాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అఖిల్ దగ్గరకు వెళ్లిన అభిజీత్ మోనాల్‌తో కాసేపు మాట్లాడదాం అని అడిగాడు. వెంటనే ఇప్పుడు వద్దు, రేపు మాట్లాడదామని అభిజీత్ సమాధానం ఇచ్చాడు. దీనికి అఖిల్ కూడా ఓకే అని చెప్పాడు. మరి ఇవాళ్టి ఎపిసోడ్‌లోనైనా అభిజిత్, మోనాల్ మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుందేమో చూడాలి. ఇక వీరిద్దరి మధ్య అమ్మ రాజశేఖర్ మాస్టర్ డిస్కషన్ రాగా.. ఆయన పిచ్చ లైట్, ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిజీత్ అన్నాడు. (Bigg Boss 4: బీబీ డే కేర్ సెంటర్.. సొహైల్‌కి చుక్కలు చూపించిన అరియానా)