బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది. సోమవారం తో 93వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్4 .మిగిలిన ఇంటి సభ్యుల్లో ఎవరు విజేతగా నిలుస్తారని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో చప్పగా సాగిన బిగ్ బాస్ చివరకు వచ్చేసరికి రసవత్తరంగా మారింది. ఊహించాని రీతిలో బిగ్ బాస్ ఇంటిసభ్యులకు ఓట్లు వేసి మరీ ఎలిమినేషన్ నుంచి తప్పిస్తున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే గతవారం అవినాష్ ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం ఆరుగురు హౌస్ లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్ లో ఎవరికీ వారు టాస్క్ ఆడి, వందశాతం ఎఫర్ట్ పెట్టాలని చెప్పాడు బిగ్ బాస్. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా గేమ్ ఆడాలని, గేమ్ ఆడే తీరు, ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఈ రెండు దృష్టిలో ఉంచుకొని టాస్క్ ఆడాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక ప్రేక్షకుల మెప్పుపొందేందుకు అఖిల్ మినహా అందరిని నామినేట్ చేసాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలే లభించిన కారణంగా అఖిల్ మినహా.. మిగిలిన సభ్యులంతా నామినేట్ అయినట్టు తెలిపాడు. ఈ నామినేషన్ ప్రక్రియలో సమయానుకూలంగా టాస్క్ లు ఇవ్వడం జరుగుతుందని, అప్పుడు ప్రేక్షకులను అలరించాలని చెప్పాడు. దాంతో ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకొని రంగంలోకి దిగారు.