Bigg Boss 4: ప్రశ్నించినందుకే దేవి ఎలిమినేట్ అయ్యిందా..!

| Edited By:

Sep 28, 2020 | 8:25 AM

బిగ్‌బాస్‌ మూడో వారంలో ఎలమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది దేవి. హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి అందరికీ గట్టి పోటీ ఇచ్చిన దేవి

Bigg Boss 4: ప్రశ్నించినందుకే దేవి ఎలిమినేట్ అయ్యిందా..!
Follow us on

Devi eliminates Bigg Boss 4: బిగ్‌బాస్‌ మూడో వారంలో ఎలమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది దేవి. హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి అందరికీ గట్టి పోటీ ఇచ్చిన దేవి, అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఇది నిజంగా వీక్షకులకు షాక్‌ కలిగించే విషయమే. ఎందుకంటే ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. దీంతో అసలు దేవి ఎందుకు ఎలిమినేట్ అయ్యిందన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. కొందరిలా సేఫ్‌ గేమ్ ఆడకుండా.. ప్రశ్నించినందుకే ఇలా ఎలిమినేట్ చేశారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే మొదటిసారి ఎలిమినేషన్‌ కోసం నామినేట్ అయినప్పటి నుంచి తనను సపరేట్‌గా చూస్తున్నారంటూ దేవి పలుమార్లు చెప్పుకొచ్చింది. ఈ విషయంపై నాగార్జున ముందే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. కాగా హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి దేవి తన పంథాలోనే ఉంది. అవసరం ఉన్నప్పుడే నవ్వేది, నవ్వించేది. ఆడేటప్పుడు సీరియస్‌గా ఆడేది. కొంతమంది కంటెస్టెంట్‌లా ఏదో హాట్ టాపిక్‌గా మారాలని ఆమె ఎప్పుడూ ప్రవర్తించలేదు. అంతేకాదు కావాలని గొడవ పెట్టుకున్న సందర్భాలు లేవు. అలాగే తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్పేది. ఎవరి మెప్పు పొందాలని తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. ఎవరి మధ్య పుల్లలు పెట్టలేదు. ఇలా దేవిలో చాలా పాజిటివ్‌లే ఉన్నాయి.

అయితే నామినేషన్‌లో రాజశేఖర్ మాస్టర్‌ మెడను పట్టుకొని నెట్టడం, ఆయన బోరుగా ఏడ్చడంతో దేవిపై కాస్త నెగిటివ్‌గా మారింది. ఆ టాస్క్ ఇచ్చింది బిగ్‌బాస్ అయినప్పటికీ.. ఎఫెక్ట్ మాత్రం దేవిపై పడింది. ఇక తప్పు చేయనప్పుడు సారీ చెప్పేందుకు దేవి ఒప్పులేదు. ఇది కొంతమందికి తప్పుగా కనిపిచ్చి ఉండొచ్చు. ఇక గేమ్‌ల గురించి ఈ పిచ్చి గేమ్‌లు ఏంటంటూ దేవి మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆమెను కరాటే కళ్యాణి చేత డైరెక్ట్ నామినేట్ చేయించి ఎలిమినేట్ చేశారని దేవికి మద్దతు ఇచ్చే వారు అంటున్నారు. హౌజ్‌లో కొనసాగాలంటే ఎవరితోనైనా అఫైర్ నడిపించాలి. లేదంటే పులిహోర కలపాలి. అలా కాకుండా గేమ్ గేమ్ అంటూ సీరియస్‌గా ఉండే దేవిలాంటి వాళ్లను బయటకు పంపిస్తారంటూ వారు మండిపడుతున్నారు.

Read More:

Bigg Boss 4: పాజిటివ్ బిగ్‌బాస్‌.. ఆమెను సేవ్ చేసిన దేవి

Bigg Boss 4: ఊహించని షాక్‌.. ఎలిమినేట్ అయిన దేవి