Abhijeet Akhil fight: ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ హాట్‌హాట్‌గా జరిగింది. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా అభిజిత్-అఖిల్.. హారిక-సొహైల్‌లు కొట్టుకునే దాకా వెళ్లారు.
తనను తాను పులిగా అభివర్ణించుకున్న అఖిల్.. తాను సీక్రెట్ రూంకి వెళ్లిన తరువాత అభిజిత్ తన గురించి బ్లఫ్ అంటూ తప్పుగా మాట్లాడాడని అన్నాడు. అభిజిత్ రోబో టాస్క్‌లో తప్పితే మరో టాస్క్‌లో ఆడినట్టుగా తనకు కనిపించలేదని, ఆడుతున్నాడు కానీ.. ఇమ్యూనిటీ అవసరం లేదు, ప్రజలు సేవ్ చేస్తారన్న కాన్ఫిడెంట్‌తో ఉన్నాడని అన్నాడు.
అంతటితో ఆగకుండా ఓ కథను చెప్పుకొచ్చాడు. మటన్ షాపు ఓనర్ మేకకి గడ్డి చూపించాడు. మేక లోపలికి వెళ్లిపోయింది. తరువాత ఏం కాలేదు అభి.. మేకని మటన్ షాపు ఓనర్ ఎక్స్ ట్రా ప్రోటీన్స్ పెట్టి పులిగా బయటకు వదిలాడు. అదే నేను కెప్టెన్ అయ్యా అంటూ తన గురించి ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు. అందరూ టాస్క్‌లు ఆడి కెప్టెన్ అయ్యారు. కానీ నాకు మాత్రం ఎవరితోనే గెలవకుండానే ఇమ్యునిటీ ఇచ్చి బిగ్‌బాస్ కెప్టెన్‌ని చేశారు అంటూ డబ్బా కొట్టుకున్నాడు.
వెంటనే అఖిల్ మిస్ అయిన లాజిక్‌ని పట్టుకున్న అభి.. మేక ఎప్పుడూ పులి కాదు, బలైతదని కౌంటరిచ్చాడు. మధ్యలో ఒకమ్మాయి గురించి అని అఖిల్ స్టార్ట్ చేయబోతుంటే.. అమ్మాయి విషయం మధ్యలోకి లాగకు అంటూ ఆ విషయాన్ని ఆపేశాడు అభి. నాకు 32, నీది 25 ఏళ్లు.. బచ్చాగానివి.. ఛల్‌ఛల్, జా అంటూ అభి, అఖిల్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయినా సరే తగ్గని అఖిల్ 25 ఏళ్లలోనే తాను బిగ్‌బాస్‌కు వచ్చానని ఏదో గొప్పగా చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత సొహైల్.. హారిక తనను చిచ్చుబుడ్డి అన్నందుకు బాధపడ్డానని అన్నాడు. ఆమెను ఎప్పుడూ ఒక్కమాట కూడా అనలేదు అని బాధపడుతూనే సీరియస్ అయ్యాడు. దీనిక స్పందించిన హారిక నీ అవ్వ పో అనడం నీకు ఊతపదం అయితే వేస్ట్‌గాడు అనేది నాకు ఊతపదం అని స్పష్టం చేసింది. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరగ్గా.. గింతంత లేవు, ఆపు అని సొహైల్ బాడీ షేమింగ్ కామెంట్లు చేశాడు. నాహైట్‌ని ఎందుకు అంటున్నావు. నువ్వు మాస్ అయితే నేను ఊరమాస్.. నాతో రుబాబుగా మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.