బిగ్ బాస్ తెలుగు సీజన్ 4… బిగ్‌బాస్‌లోకి మాజీలు… ఎవరెవరు వచ్చారంటే… ఏమేమీ సలహాలిచ్చారంటే…

| Edited By:

Dec 16, 2020 | 10:42 AM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది. హౌస్‌లో చివరి రోజులను కంటెస్టెంట్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు. హౌస్‌లోని ఫైనలిస్టుల ముందుకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను తీసుకొచ్చాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4... బిగ్‌బాస్‌లోకి మాజీలు... ఎవరెవరు వచ్చారంటే... ఏమేమీ సలహాలిచ్చారంటే...
Follow us on

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది. హౌస్‌లో చివరి రోజులను కంటెస్టెంట్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు. హౌస్‌లోని ఫైనలిస్టుల ముందుకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను తీసుకొచ్చాడు. ఈ విధానం హిందీ బిగ్‌బాస్‌ను గతంలో జరిగింది. బిగ్‌బాస్ షోకు తిరిగి వచ్చిన వారిలో ఫస్ట్ ‌సీజన్ ఫైనలిస్ట్ హరితేజ, రెండో సీజన్ రన్నరప్ గీతా మాధురి, మూడో సీజన్ రన్నరప్ శ్రీముఖిలతో పాటు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా వచ్చారు. అయితే వారు హౌస్‌లోకి వెళ్లలేదు. కోవిడ్ కారణంగా ప్రత్యేక గ‌దిలో నుంచే ఫైన‌లిస్టుల‌తో మాట్లాడించారు. మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత ఇంటి సభ్యులకు సలహాలు, సూచనలు చేశారు.

ఆరిపోతావు అరియానా…

హౌస్‌మేట్స్తో మాట్లాడుతున్న శ్రీముఖి అరియానాను ఇంకొన్ని రోజులైతే ఆరిపోయేట్టు ఉన్నావు, కాస్త తిన‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది. అంతేకాకుండా సీనియ‌ర్లు అరియానాను లౌడ్ స్పీక‌ర్‌గా అభివ‌ర్ణిస్తూ ఇమిటేట్ చేశారు. అయితే కొన్నిసార్లు ఆమె లీడ్ తీసుకుని మాట్లాడ‌టాన్ని శ్రీముఖి మెచ్చుకుంది. దీనిపై అరియానా స్పందిస్తూ.. గత సీజ‌న్‌లో శ్రీముఖికే స‌పోర్ట్ చేశాను, ఆమె ఆడిన విధానం న‌చ్చిందంటూ చెప్పుకొచ్చింది. హౌస్ అంతా రివ‌ర్స్ అయిన‌ప్పుడు కూడా పాజిటివ్‌గా మాట్లాడ‌టం గ్రేట్ అని హ‌రితేజ సైతం అరియానాను మెచ్చుకుంది.

సోహైల్‌కు కష్టం అన్న హరితేజ…

నీకు ఎలాంటి అమ్మాయి కావాలన్న ప్రశ్నకు సోహైల్‌ త‌న కోపాన్ని కూల్ చేయ‌గ‌లగాలి అని చెప్పాడు. ఇది జ‌ర‌గ‌ని ప‌ని అని హ‌రితేజ అంది. మోనాల్ వెళ్లాక సైలెంట్ అయ్యావేంట‌ని అఖిల్‌ను ప్రశ్నించగా… సోహైల్ మ‌ధ్యలో లేచి అంత లేదంటూ, ఇక్కడ ఇద్దరికి సోపులేస్తున్నాడ‌ని పంచ్ వేశాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక కాసేప‌టివ‌ర‌కు ఊపిరి ఆడ‌లేద‌ని అఖిల్ చెప్పుకొచ్చాడు. కాగా…గ‌ర్ల్ ఫ్యాన్స్ కోసం అభిజిత్‌తో మాజీలు పాట పాడించారు. అలాగే హౌస్‌లో చివరి రోజులను ఎంజాయ్ చేయండని సలహా ఇచ్చారు. తప్పులు చేయండని శ్రీముఖి సైతం సలహా ఇచ్చింది.