Swathi romances Abhijith: గతవారం వైల్డ్ కార్డుతో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్.. మోనాల్, హారికలకు గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా ఆమె ఎంట్రీతో మోనాల్, హారికలకు కాస్త దూరమయ్యారు అభిజిత్. మరోవైపు స్వాతితో తెగ పులిహోర కలిపేస్తూ వస్తున్నారు అభిజిత్. వీరిద్దరి రొమాన్స్‌పై హౌజ్‌లోని సభ్యులే కాదు వీక్షకులు సైతం పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అమ్మాయిలకు పులిహోర కలపడంలో అభిజిత్ పీహెచ్‌డీ చేసి ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం నాటి ఎపిసోడ్‌లో మార్నింగ్ మస్తీలో భాగంగా స్వాతి దీక్షిత్ నవరసాలు నేర్పించాలని బిగ్‌బాస్ ఆదేశించారు. నవరసాల్లో భాగంగా మొదట శృంగార రసాన్ని ఎంచుకున్న స్వాతి.. ఆ రసాన్ని అభిజిత్‌తోనే చేసింది. ఈ టాస్క్‌లో వీరిద్దరి మధ్య రొమాన్స్ బాగా పండింది. మొత్తానికి అభిజిత్, స్వాతిల కొత్త లవ్ స్టోరీ హౌజ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Read More:
Bigg Boss 4: లాస్య-నోయెల్ మధ్య గొడవ.. ఉఫ్‌మన్న వీక్షకులు
Bigg Boss 4: నామినేషన్‌లో ఏడుగురు.. మర్డర్‌లతో రెచ్చిపోయిన అఖిల్