Samantha Bigg Boss 4: వ్యాఖ్యతగా మొదటిసారి చేస్తున్నప్పటికీ బిగ్‌బాస్ 4లో సండే ఎపిసోడ్‌లో సమంత అదరగొట్టింది. కంటెస్టెంట్‌ల గురించి బాగా అధ్యయనం చేసి వచ్చిన సమంత.. ఒక్కొక్కరితో మాట్లాడింది. ఈ సందర్భంగా మోనాల్ గురించి మాట్లాడుతూ.. మోనాల్ తెలుగు బాగా నేర్చుకుంది. హౌజ్‌లో చాలా మందికి నేర్పుతుంది. ప్రేమ పంచుతుంది. ప్రేమించడం నేర్పుతుంది అని సమంత సెటైర్లు వేశారు. దానికి నేను గేమ్ ఆడటానికి వచ్చా. అదే చేస్తున్నా అని మోనాల్ చెప్పింది.
వెంటనే సమంత.. నీకు నేను ఒక సలహా చెప్పనా.. ఇంట్లో నాకు, చైతుకు ఏదైనా విషయంలో డిస్కషన్ వచ్చినప్పుడు నేను స్ట్రైట్‌గా మాట్లాడతా. కానీ ఏడిస్తే ఆయనకు చాలా కోపం వస్తుంది. ఏడుపు ఒకసారే వర్కౌట్ అవుతుంది అని చెప్పింది. ఈ మాటలకు మళ్లీ ఏడ్వటం మొదలుపెట్టింది మోనాల్. వెంటనే సమంత ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు. దయచేసి ఏడవద్దు అని మోనాల్‌ని కూర్చోబెట్టింది.
Read More:
Bigg Boss 4: నా పేరూ ‘ఏ’తోనే స్టార్ట్ అవుతుంది: మోనాల్‌తో ఆది పులిహోర
Bigg Boss 4: మోనాల్‌ని నామినేట్ చేశా.. గుండె భారంగా అనిపించింది