Bigg Boss 4: ‘బిగ్‌బాస్’ ఫ్లెడ్జ్‌.. దూరంగా అభి, అఖిల్

| Edited By:

Sep 26, 2020 | 9:58 AM

గురువారం నాటి ఎపిసోడ్‌లో ఉక్కు హృదయం టాస్క్‌లో వరస్ట్‌ పర్ఫామర్‌గా నిలిచిన నోయెల్‌కి బిగ్‌బాస్ జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే

Bigg Boss 4: బిగ్‌బాస్ ఫ్లెడ్జ్‌.. దూరంగా అభి, అఖిల్
Follow us on

Bigg Boss 4 Telugu: గురువారం నాటి ఎపిసోడ్‌లో ఉక్కు హృదయం టాస్క్‌లో వరస్ట్‌ పర్ఫామర్‌గా నిలిచిన నోయెల్‌కి బిగ్‌బాస్ జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ‌ జైలులో ఉన్న నోయల్‌తో కలిసి కంటెస్టెంట్‌ల చేత ఫ్లెడ్జ్‌ చేయించారు. బిగ్ బాస్ మై డ్రీమ్.. ఆల్ ది కంటెస్టెంట్స్ ఆర్ మై బ్రదర్స్ సిస్టర్ అంటూ అభి మినహా మిగిలిన వారు ప్లెడ్జ్ చేశారు. అభిజిత్, అఖిల్‌ మాత్రం వాళ్లను గమనిస్తూ ఉండిపోయారు. ఇక నోయల్ జైలు శిక్షాకాలం ముగిసినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. దీంతో ఇంటి సభ్యులందరూ చత్రపతి రేంజ్‌లో డాన్స్‌లు వేస్తూ నోయల్‌కి స్వాగతం పలికారు. అయితే అఖిల్ మాత్రం ఎప్పటిలాగే తన యాటిట్యూట్ చూపిస్తూ దూరంగానే ఉన్నాడు.

Read More:

IPL 2020 , KKR vs SRH..నువ్వా.. నేనా తేల్చుకుందాం..!

ఢిల్లీతో కూడా ధోనీ సేన ఓటమి