Breaking News
  • అమరావతి : మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా . ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానాలు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రి కి చేరుకున్న సీఎం జగన్. ఘాట్ రోడ్ మార్గంలో వచ్చిన సీఎం . సీఎం జగన్ కు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ,జిల్లా ప్రజా ప్రతినిధులు ,కలెక్టర్ ,సిపి [ సాంప్రదాయ వస్త్ర ధారణ పంచెకట్టు లో సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • చిత్తూరు: చిత్తూరులో భారీ ఎత్తునపట్టుబడిన ఎర్రచందనం. ఐదు కార్లలో రెండు కోట్ల విలువైన రెండున్నర టన్నుల ఎర్రచందనం పట్టి వేత. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఎర్రచందనం. 11మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో పదిమంది స్మగ్లర్ల పరారీ.. కార్లు, ఆటోలు, పాల వానలు లో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడటం ఇదే మొదటిసారి.

ఢిల్లీతో కూడా ధోనీ సేన ఓటమి

ధోనీ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. దుబాయి వేదికగా ఢిల్లీతో తలపడిన తన మూడో టీ20లో 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది.

CSK loses, ఢిల్లీతో కూడా ధోనీ సేన ఓటమి

ధోనీ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. దుబాయి వేదికగా ఢిల్లీతో తలపడిన తన మూడో టీ20లో 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్‌(43/35 బంతుల్లో 4ఫోర్లు), కేదార్‌ జాధవ్‌(26/ 21 బంతుల్లో 3ఫోర్లు) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు.

ఓపెనర్లు మురళీ విజయ్‌(10), షేన్‌వాట్సన్‌(14) ఆదిలోనే ఇంటిదారి పట్టారు. వారి ప్రదర్శన మరోసారి విఫలమయ్యారు. తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్‌(5) కూడా అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దీంతో చెన్నై 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకలలోతూ కష్టాల్లోకి వెళ్లిపోయింది.

ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్‌, కేదార్‌ జాధవ్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసినా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. చివర్లో కెప్టెన్‌ ధోనీ(15 పరుగులు) క్రీజులోకి వచ్చినా అప్పటికే టార్గెట్ కొండంతగా మారింది. ఈ నేపథ్యంలో చెన్నై ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిచెందింది. దిల్లీ బౌలర్లలో రబాడ 3, నోర్జే 2 వికెట్లు తీయగా, అక్షర్‌ పటేల్‌ మరో వికెట్‌ తీశాడు.

అంతకుముందు – టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు చెలరేగి ఆడటం జట్టు విజయానికి కలిసి వచ్చింది. పృథ్వీషా 43 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ‌35 రన్స్‌ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 10.4 ఓవర్లలో 94 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. అయితే.. ఆ తర్వాత వరసగా ఇద్దరు ఔటయ్యారు. ఆ తర్వాత రిషభ్‌ పంత్, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తమదైన శైలిలో బ్యాటింగ్‌ చేశారు. దీంతో ఢిల్లీ టీమ్‌ స్కోరు పరుగులు పెట్టింది. చెన్నై బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు.

Related Tags