Bigg Boss 4: ఇంగ్లీష్‌ మాటలు.. ఆ ఇద్దరికి క్లాస్ పీకిన నాగార్జున

| Edited By:

Oct 04, 2020 | 8:15 AM

ఎప్పటిలాగే బిగ్‌బాస్ 4 వారాంతం ఎపిసోడ్‌ని జోష్‌తో ప్రారంభించిన నాగార్జున.. కంటెస్టెంట్‌ల గురించి చర్చించారు. ఈ క్రమంలో కుమార్ సాయిని

Bigg Boss 4: ఇంగ్లీష్‌ మాటలు.. ఆ ఇద్దరికి క్లాస్ పీకిన నాగార్జున
Follow us on

Bigg Boss 4 Nagarjuna: ఎప్పటిలాగే బిగ్‌బాస్ 4 వారాంతం ఎపిసోడ్‌ని జోష్‌తో ప్రారంభించిన నాగార్జున.. కంటెస్టెంట్‌ల గురించి చర్చించారు. ఈ క్రమంలో కుమార్ సాయిని తిట్టే నాగార్జున మొదటిసారిగా అతడిని మెచ్చుకున్నారు. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో అభిజిత్‌, హారికలకు నాగ్‌ గట్టిగా క్లాస్ పీకారు. మొదటి సీజన్ నుంచి హౌజ్‌లోకి వెళ్లిన ప్రతి ఒక్కరు తెలుగు మాట్లాడాలన్న రూల్‌ ఉండగా.. ఈ సీజన్‌లో దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆ మధ్యన బిగ్‌బాస్ కూడా కంటెస్టెంట్‌లను హెచ్చరించారు. దీంతో కాస్తో, కూస్తో పరిస్థితులు మారినట్లు అనిపించినా.. ఇంకొందరు మాత్రం ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎప్పుడూ ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నందుకు అభిజిత్‌, హారికల‌కు నాగార్జున క్లాస్ పీకారు. తెలుగులో మాట్లాడేందుకు మోనాల్ చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకున్న నాగ్‌.. అభి, హారికలకు అక్షింతలు వేశారు. వారిద్దరు ఇంగ్లీష్‌లో మాట్లాడుకున్న ఓ వీడియోను బిగ్‌బాస్ ప్లే చేశారు. ఈ క్రమంలో తన ఆలోచనలను తెలుగులో చెప్పేందుకు సమయం పడుతుందని, అందుకే ఇంగ్లీష్‌లో మాట్లాడానని అభిజిత్‌ చెప్పాడు. అయితే మీరు మాట్లాడేది చాలామందికి అర్థం కావ‌డం లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసిన నాగ్..‌ ఈ రోజు ఎపిసోడ్ పూర్త‌య్యేవరకు వీరిద్ద‌రూ నిల్చునే ఉండాలని శిక్ష విధించారు.

Read More:

Bigg Boss 4: అఖిల్‌ని టార్గెట్‌ చేసిన ఆ జంట..!

Bigg Boss 4: స్వాతి దీక్షిత్‌ ఔట్‌.. ఈ సారి డబుల్ ఎలిమినేషన్..!