Bigg Boss 4: బిగ్ బాస్ 4 చివరి దశకు చేరుకునేసరికి గేమ్ ప్లే మంచి రసవత్తరంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండటంతో టైటిల్ విజేత ఎవరవుతారన్నది అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్లకు మద్దతు తెలుపుతూ భారీగా ఓట్లు వేస్తూ.. ఎలిమినేషన్ నుంచి తప్పిస్తున్నారు. ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు తన సపోర్ట్‌ను జబర్దస్త్ అవినాష్, అభిజిత్‌లకు తెలుపుతూ ఓ వీడియోను చేశారు.
”మా అవినాష్‌తో పాటు బిగ్ బాస్‌లో నాకు నచ్చిన వన్ మోర్ కంటెస్టెంట్ అభిజిత్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో యాక్ట్ చేశాడు. బయట అతన్ని ఒకట్రెండు సార్లు కలిశాను. మొదటిసారి మాట్లాడినప్పుడే నాకు మంచి కుర్రాడిలా అనిపించాడు. చాలా డౌన్ టూ ఎర్త్ మనస్తత్వం కలిగిన అబ్బాయి. ఒక హీరోగా సక్సెస్ అయినట్లయితే బాగుండేదనిపించింది. అయితే అవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్‌లో మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. నేను నా వ్యక్తిగతంగా జబర్దస్త్ నుంచి వెళ్లిన మా అవినాష్‌కు నా సపోర్ట్ ఉన్నా కూడా.. నా మనసు, నా ఇష్టం అభిజిత్‌పై ఉంది. ఖచ్చితంగా అవినాష్‌తో పాటు అభిజిత్ కూడా ఫైనల్ వరకు వెళ్లాలి. వీరిద్దరికీ మీ సపోర్ట్ కావాలంటూ” మెగా బ్రదర్ నాగబాబు వీడియో ద్వారా తన మద్దతును అభిజిత్, అవినాష్‌లకు ప్రకటించారు.