Monal Sohel emotional: బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు పంపుతామంటూ చివరకు అఖిల్‌ని సీక్రెట్ రూమ్‌కి పంపిన విషయం తెలిసిందే. ఇక సీక్రెట్ రూమ్‌కి వెళ్లగానే బిగ్‌బాస్‌కి థ్యాంక్స్ చెప్పిన అఖిల్.. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు. ఇక అఖిల్ వెళ్లిపోవడంతో మోనాల్ అతడిని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. దీన్ని చూసిన అఖిల్ ఫీల్ అయ్యాడు. మరోవైపు అఖిల్‌ని గుర్తు చేసుకున్న సొహైల్.. ఇలా కనెక్ట్ అయ్యానేంటిరా అంటూ తెగ ఫీల్ అయ్యి ఏడ్చేశాడు. (Bigg Boss 4: సీక్రెట్ రూమ్‌కి అఖిల్.. అభికి అర్థం అయ్యిందా..!
ఇదిలా ఉంటే కెప్టెన్సీ టాస్కులో సొహైల్ బయటకు రావడం ఏంటని అభి హారికతో అన్నాడు. వాళ్లు గొడవపడి పది రోజులు మాట్లాడుకోలేదు అని అన్నాడు. ఇక దీన్ని చూసిన అఖిల్.. ఇది పెద్ద అబద్దం అన్నాడు. అయితే అఖిల్ బయటకు వెళ్లినట్లు నమ్మని అభి.. ఇది నువ్వు చూస్తుంటే వచ్చాక దీని గురించి మాట్లాడతాను అని చెప్పాడు. ఇక అఖిల్ వెళ్లిపోయాక ఇల్లు చాలా సైలెంట్‌గా ఉందని మోనాల్ ఫీల్ అవుతుంటే.. తనకు ఎప్పటిలాగే ఉందని అభి అన్నాడు. ( విదేశీ టపాకాయలు అమ్మితే చర్యలు)