
Monal Gajjar Bigg Boss 4: బుల్లితెరపై బిగ్‌బాస్ 4 హవా కొనసాగుతోంది. ఈ షో ప్రారంభమై ఐదు వారాలు పూర్తవ్వగా.. ఇప్పటివరకు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, స్వాతి దీక్షిత్, దేవి, గంగవ్వ, జోర్దార్ సుజాతలు బయటకు వచ్చేశారు. ఇక ఆరోవారం ఎలిమినేషన్‌కి గానూ ఇవాళ నామినేషన్ మొదలైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఓ ప్రోమోను విడుదల చేశారు. అందులో ఎలిమినేషన్‌కి నామినేట్ చేసే వారు ఎండు మిర్చి దండను వారి మెడలో వేయమని బిగ్‌బాస్ వెల్లడించారు. ఈ క్రమంలో పలువురు మెహబూబ్‌ని టార్గెట్ చేసినట్లు ప్రోమోలో అర్థమైంది. ఇదిలా ఉంటే ఈ ప్రోమోలో మోనాల్ చేతికి సెలైన్ సూదిని ఉంది. దీంతో మోనాల్‌కి ఆరోగ్యం బాలేదా..? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మోనాల్‌కి ఏమైంది..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మోనాల్‌కి ఏమైంది..? నీరసం వలన సెలైన్ పెట్టించుకుందా..? వంటి ప్రశ్నలకు ఇవాళ్టి ఎపిసోడ్‌లో సమాధానాలు తెలుస్తాయోమో చూడాలి.
Read More:
కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్.. శాస్త్రవేత్తల హెచ్చరిక