”అభిజిత్‌తో ఉండి తప్పు చేశా.. నా కళ్లు తెరిపించావ్ బిగ్ బాస్”

|

Oct 18, 2020 | 6:27 PM

బిగ్ బాస్ హౌస్‌లో మోనాల్ గజ్జర్ ఎక్కువగా అభిజిత్, అఖిల్‌లతోనే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ల దగ్గర లేకపోతే కెమెరాల ముందుకు..

అభిజిత్‌తో ఉండి తప్పు చేశా.. నా కళ్లు తెరిపించావ్ బిగ్ బాస్
Follow us on

Bigg Boss 4: బిగ్ బాస్ హౌస్‌లో మోనాల్ గజ్జర్ ఎక్కువగా అభిజిత్, అఖిల్‌లతోనే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ల దగ్గర లేకపోతే కెమెరాల ముందుకు వెళ్లి మాట్లాడటం, ఏడవడం లాంటిది చేస్తుంటుంది. ఇక తాజాగా ఓ అన్‌సీన్‌ వీడియోలో మోనాల్ కెమెరాల ముందుకు వెళ్లి అభిజిత్‌తో తనకు ఉన్న రిలేషన్ గురించి మాట్లాడింది.

”నాకు ఏం బ్యాడ్ ఫీలింగ్ లేదు. వాటన్నింటిని వదిలేస్తున్నా. ఈ మధ్య అభితో జరిగిన చాలా డిస్కషన్స్ బ్యాడ్ ఫీల్ కలిగించాయి. అతనితో మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అర్ధమైంది. అభికి, నాకు మధ్య ఒక్క సిమిలారిటీ కూడా లేదు. ఇద్దరం వేర్వేరు. అతని ఫ్రెండ్ సర్కిల్ డిఫరెంట్.. నాది డిఫెరెంట్.. అభికి నాకు మధ్య ఈక్వాలిటీ కూడా లేదు. ఇద్దరికీ మ్యాచ్ కాదు. నా లైఫ్‌లో ఒకవారం అభితో ఉన్నందుకు బాధపడుతున్నా.. వేస్ట్ చేశా.. మళ్లీ ఆ తప్పు చేయను. నా కళ్ళు తెరిపించావ్ బిగ్ బాస్.. థ్యాంక్యూ అని కెమెరా ముందు మోనాల్ మాట్లాడింది.