Bigg Boss 4: టాస్క్ ఎఫెక్ట్‌.. కెమెరాలకు దిండ్లు పెట్టి బయటే పని కానిచ్చేసిన భామలు

| Edited By:

Sep 23, 2020 | 8:10 AM

బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. వీక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు బిగ్‌బాస్‌ కొత్త కొత్త టాస్క్‌లను ఇస్తున్నారు

Bigg Boss 4: టాస్క్ ఎఫెక్ట్‌.. కెమెరాలకు దిండ్లు పెట్టి బయటే పని కానిచ్చేసిన భామలు
Follow us on

Bigg Boss 4 Telugu update: బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. వీక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు బిగ్‌బాస్‌ కొత్త కొత్త టాస్క్‌లను ఇస్తున్నారు. ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ‘ఉక్కు హృదయం’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా రోబోలు, మనుషులు రెండు టీంలుగా విడిపోమన్నారు. ఒక సిల్వర్ బాల్ ఒకటి ఇచ్చి దాన్ని పగలకొడితే రోబోలు చనిపోయినట్టని.. అలా ఒక్కో రోబోను చంపితే మనుషులు విజేతలు అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. లేదంటే రోబోలకు పూర్తిగా చార్జింగ్ అవగొట్టేసి చంపేయాలి. మనుషులకు ఏం కావాలన్నా.. రోబోలకు చార్జింగ్ ఇచ్చి కావల్సినవి పొందాలి. ఇదీ గేమ్ఇ. క గెలిచిన టీంలో నుంచే కెప్టెన్ పోటీ దారుడు ఉంటాడని, వచ్చే వారానికి ఇమ్యునిటీ లభిస్తుందని బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో అసలు వార్ మొదలైంది. మనుషులు పింక్ కలర్ యూనిఫాంతో, రోబోలు సిల్వర్ కలర్ యూనిఫాంతో రెడీ అయిపోయారు.

మనుషుల టీంలో అఖిల్, మోనాల్‌, అమ్మా రాజశేఖర్, నోయల్, మొహబూబ్, దివి, సుజాత, సొహైల్‌లు ఉండగా.. రోబో టీంలో అభిజిత్, దేవి, లాస్య, అవినాష్, కుమార్, గంగవ్వ, హారిక, అరియానాలు ఉన్నారు. మొదటంతా లైట్ తీసుకుని ఆడిన మనుషులు తరువాత మాత్రం కుండ పగులబెట్టి సత్తా చాటారు. దీంతో రోబోగా ఉన్న దేవి చనిపోయింది. ఈ టాస్క్‌లో రోబోగా గంగవ్వ కూర్చోకుండా ఆటలో భాగమవడం ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉంటే ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడం.. దివి, సుజాత, మోనాల్‌లకు‌ వాష్ రూం అర్జెంట్ కావడంతో, కెమెరాలకు దిండ్లు అడ్డు పెట్టి, బెడ్ షీట్‌లు అడ్డంగా పెట్టుకుని వారు పనికానిచ్చారు. ఇది చూసేందుకు చాలా చిరాగ్గా ఉంటుంది. అయితే దీనిపై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమెరాలను క్లోజ్ చేయడం ఆటకు విరుద్ధమని.. ఇంకోసారి ఇలా చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇక ఈ టాస్క్‌కి సంబంధించి రేపటి ఎపిసోడ్‌లో మరింత రచ్చ ఉండబోతున్నట్లు ప్రోమోను వదిలారు.

Read More:

ప్రముఖ నటి జరీనాకు కరోనా పాజిటివ్‌

Bigg Boss 4: ఇంప్రెస్ అయిన మోనాల్.. జోష్ పెంచిన అవినాష్