Breaking News
  • కర్నూలు శ్రీశైలం: టీవీ9 తో శ్రీశైలం డ్యాం రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాతి రెడ్డి. శ్రీశైలం డ్యాం గేట్ల కింద plunjpool గొయ్యి 100 మీటర్ల వరకు ఉంటే డ్యామ్ ప్రమాదంలో ఉన్నట్లే అత్యంత ప్రధానమైన పనులన్నీ పక్కన పెట్టి ప్రభుత్వము ప్లింజ్ పూల్ పై తక్షణమే దృష్టిసారించాలి.. లేకుంటే ప్రళయం తప్పదు. ఫ్లడ్డు సీజన్ ముగిసిన వెంటనే ప్రతి ఏటా ప్రతి రిజర్వాయర్ డ్యాం గేట్ల కింద గొయ్యి లు లేకుండా చూసుకోవాలి . డ్యామ్ ఫౌండేషన్ కంటే ప్లుంజ పూల్ (గొయ్యి) లోపలికి వెళ్ళరాదు. అలా జరిగితే ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఈ సమస్యను ప్రభుత్వము అత్యవసరంగా చేపట్టాలి.
  • వరంగల్ : ఈ రోజు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. పాలకుర్తి నియోజవర్గం పరిధిలోని కొడకండ్లలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. హైద్రాబాద్ (బేగంపేట) నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 12:30గంటలకు కొడకండ్ల కు చేరుకుంటారు. 12:40 నివిుషాలకు.కొడకండ్ల గ్రామంలో ఉన్న రైతు వేదికను ప్రారంభిస్తారు. 12:50నివిుషాలకు పల్లెప్రకృతివనాని సందర్శిస్తారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో 5000 మ౦ది రైతులతో సమావేశంలో పాల్గొంటారు. సభ అనంతరం మండల పార్టీ కొడకండ్ల లోనే మధ్యాహ్న భోజనం. అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనం.
  • అమరావతి : వచ్చే నెల రెెండో తేదీ నుంచి డిగ్రీ, పీజీ తరగతుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఈ మేరకు యూనినర్శిటీలు, కాలేజీ ల్లో తీసుకోవాల్సిన కరోనా జాగ్రత్తలపై గైడ్ లైన్స్ జారీ. యూనివర్శీటీలకు.. కాలేజీలకు అకడమిక్ క్యాలెండర్ విడుదల. వారంలో ఆరు రోజుల పాటు తరగతులు నిర్వహించాలని ఆదేెశం. ఏ రోజైనా పని దినాల్లో సెలవు ఇవ్వాల్సి వస్తే దానికి బదులుగా శెలవు దినాలు, రెండో శనివారాలు, ఆదివారాల్లో క్లాసులు నిర్వహించాలని సూచన. క్లాస్ రూమ్స్, క్యాంటీన్లు, జిమ్ వంటి ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలకు ఆదేశం. హాస్టళ్లల్లోనూ కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. హాస్టళ్లను ఒకటో వంతు విద్యార్ధులను మాత్రమే అనుమతించాలని ఆదేశం. కామన్ హాల్స్.. టీవీ హాల్సును వసతి కోసం వివియోగించుకోవాలన్న ప్రభుత్వం.
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.92 కోట్లు. శ్రీవారిని దర్శించుకున్న 20,269మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 6,613 మంది భక్తులు. ఈరోజు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ. కోవిడ్ కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్న అర్చకులు.

ప్రముఖ నటి జరీనాకు కరోనా పాజిటివ్‌

బాలీవుడ్‌లో మరో నటి కరోనా బారిన పడ్డారు. ప్రముఖ నటి జరీనా వహాబ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారం క్రితం

Zarina Wahab Corona, ప్రముఖ నటి జరీనాకు కరోనా పాజిటివ్‌

Zarina Wahab Corona: బాలీవుడ్‌లో మరో నటి కరోనా బారిన పడ్డారు. ప్రముఖ నటి జరీనా వహాబ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారం క్రితం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు జ్వరం, శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు ఉండటంతో వైద్యులు చికిత్స అందించారు. ఐదు రోజులకే జరీనా ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఆమెకు ఇంకా నెగిటివ్ రాలేదు. ప్రస్తుతం జరీనా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా పలు భారతీయ భాషల్లో వందలకు పైగా చిత్రాల్లో జరీనా నటించారు. చివరగా వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ హీరోయిన్లుగా నటించిన స్ట్రీట్ డ్యాన్సర్ 3లో కనిపించారు. ప్రస్తుతం తెలుగులో వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న విరాటపర్వంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మావో కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

Read More:

Bigg Boss 4: ఇంప్రెస్ అయిన మోనాల్.. జోష్ పెంచిన అవినాష్

Breaking News : ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌ చేయాలి

 

Related Tags