Jalaja Punishment Abhijeet: బిగ్‌బాస్ హౌజ్‌లో గురువారం నాటి ఎపిసోడ్‌లో అభిజిత్, అరియానా మధ్య కాసేపు కన్వర్జేషన్ జరిగింది. మొదటి నుంచి నిన్ను చూస్తున్నా.. నీ బిహేవియర్ నాకు బాగా నచ్చింది అంటూ అరియానా అభిజిత్‌తో చెప్పింది. దీంతో అభిజత్.. మొదట్లో నీకు, నాకు సెట్ కాదనుకున్నా. మధ్యలో కలిశాము. మళ్లీ విడిపోయాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అభిజిత్ ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. దీంతో ఇంటి నియమాలు ఉల్లంఘించడం నాకు నచ్చదని ముందే చెప్పిన దెయ్యం జలజ.. అభికి శిక్ష విధించింది. తల కిందకు కాళ్లు పైకి పెట్టి తెలుగు అక్షరమాలను చెప్పమంది. దీంతో అతి కష్టం మీద తలకిందులుగా ఉండి, అక్షరమాలను చెప్పేశాడు అభి.