Bigg Boss 4: గంగవ్వ గుడ్‌బై‌.. ఏడ్చేసిన కుటుంబ సభ్యులు

బిగ్‌బాస్ 4లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్‌లో లేనప్పటికీ.. గంగవ్వ ఎలిమినేట్ అయ్యారు.‌

Bigg Boss 4: గంగవ్వ గుడ్‌బై‌.. ఏడ్చేసిన కుటుంబ సభ్యులు

Edited By:

Updated on: Oct 11, 2020 | 7:15 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ 4లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్‌లో లేనప్పటికీ.. గంగవ్వ ఎలిమినేట్ అయ్యారు.‌ గత వారం రోజులుగా గంగవ్వ ఆరోగ్యం బాలేకపోవడంతో మెడికల్ రిపోర్ట్స్ చూసిన నాగార్జున, ఆమెను బయటకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కన్వెన్షన్‌ రూమ్‌కి పిలిచి, గంగవ్వతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఇక్కడ ఉండలేకపోతున్నానంటూ భోరున ఏడ్చేసింది గంగవ్వ. ఆట ఆడటం లేదు, తిండి లేదు, నిద్రలేదు, నేను ఉండలేకపోతున్నా అన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో నాగార్జున కళ్లు చెమ్మగిల్లాయి. ఆ తరువాత గంగవ్వను బయటకు పంపేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ బిగ్‌బాస్‌ని కోరారు నాగ్‌. అందుకు బిగ్‌బాస్‌, గంగవ్వను ఇంటికి వెళ్లొచ్చని చెప్పారు. దీంతో ఈ వారం గంగవ్వ ఎలిమినేట్ అయ్యారు. అయితే గంగవ్వ ఎలిమినేట్ అవ్వడంతో హౌజ్‌ శోకసంద్రంలా మారింది. అఖిల్‌ అయితే వెక్కి వెక్కి ఏడ్చేశారు.

అయితే తన గురించి ఎవ్వరూ బాధపడకూడదని, బయటకు వచ్చిన తరువాత అందరికీ కోడి కూర వండిపెడతానని కుటుంబ సభ్యులకు గంగవ్వ ధైర్యం చెప్పారు. నవ్వుతూ తనను పంపించండి అని కోరి, బిగ్‌బాస్‌ హౌజ్‌కి మొక్కి బయటకు వచ్చేసింది. అలాగే బిగ్‌బాస్ తనకు ఇల్లు కట్టించాలని గంగవ్వ కోరారు. ఇక బయటకు రాగానే గంగవ్వ, హ్యాపీనా అని నాగార్జున అడిగారు. గుడిసెలో ఉండే నాకు ఈ బిగ్‌బాస్‌ ఇల్లు బంగ్లాలా ఉందని.. సరిగా నిద్ర పట్టడం లేదని గంగవ్వ చెప్పారు. బిగ్‌బాస్ అన్న తనను బాగా చూసుకున్నాడని, అలాగే అఖిల్‌ కూడా బాగా చూసుకున్నాడని తెలిపారు. ఇంటి సభ్యుల గురించి మాట్లాడుతూ.. స్టేజ్‌పైకి వెళ్లి గంతులు వేసింది గంగవ్వ.

హారిక- అప్పుడే నవ్వుతుంది.. అప్పుడే గొడవపడుతుంది.

దివి- నన్ను సొంత అమ్మమ్మలా చూసుకుంది.

సొహైల్- నాగసర్పం లాంటోడు. కోపం వస్తే నరాలు కనిపిస్తాయి. అతనిలో మంచి లేదు.

అఖిల్- ఇద్దరికీ పోటీ ఉన్నట్టు ఉంది. ఆమె మాట్లాడే వరకూ వెనకపడతాడు. నాతో మాత్రం మంచిగా ఉంటాడు.

అమ్మా రాజశేఖర్-  హౌస్‌లో ఉండాలి. సినిమా తీస్తే నాకు వేషం ఇవ్వాలి.

మోనాల్- మంచి అమ్మాయి. ఆమెలో చెడు ఏం లేదు, తెలియక చేస్తుంది.

నోయల్-  హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిన తరువాత ఇంకో పెళ్లి చేసుకో. మా పల్లె వాళ్లు ఇక్కడకు రారు. లేదంటే నేనే సంబంధం చూసేదాన్ని.

లాస్య- నాకు పెద్ద బిడ్డ లెక్క.

సుజాత- నాకు బాగా పేలు చూసేది. అయితే నామినేషన్‌లో ఉంది. ఆమె నామినేట్ అవుతుందనిపిస్తుంది.

అరియానా- చూస్తే చిన్న పిల్లలా ఉంటుంది. ఏదైనా ఉంటే ముఖంపైనే అనేస్తుంది.

అవినాష్- కుందేలు లెక్క.. ఆటలు, పాటలతో అలరిస్తాడు.

మెహబూబ్- ఆటలు బాగా ఆడుతున్నాడు.

కుమార్ సాయి- మంచిగా నేర్చుకుంటున్నాడు. మొదట్లో ఎవరూ కలవనివ్వలేదు కానీ, ఇప్పుడు కలుస్తున్నారు అని గంగవ్వ చెప్పుకొచ్చారు.