AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: కంటెస్టెంట్‌లకు గట్టి క్లాస్ పీకిన నాగ్‌.. హెచ్చరిక

వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున కూల్‌ బిగ్‌బాస్‌ స్టేజి మీదికి వచ్చారు. కానీ కంటెస్టెంట్‌లు ఒక్కొక్కరిపై మాత్రం బాగా ఫైర్ అయ్యారు.

Bigg Boss 4: కంటెస్టెంట్‌లకు గట్టి క్లాస్ పీకిన నాగ్‌.. హెచ్చరిక
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 8:09 AM

Share

Bigg Boss 4 Nagarjuna: వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున కూల్‌ బిగ్‌బాస్‌ స్టేజి మీదికి వచ్చారు. కానీ కంటెస్టెంట్‌లు ఒక్కొక్కరిపై మాత్రం బాగా ఫైర్ అయ్యారు.పేరు పేరునా వాయించేశారు. ముందుగా నాగార్జున క్రితం రోజు ఏం జరిగిందో  టీవీలో చూశారు. అందులో బిగ్‌బాస్ హౌజ్‌లో నిద్ర పోతున్న వారందరినీ లేపి, లివింగ్ రూమ్‌లోకి రమ్మన్నాడు. బిగ్‌బాస్‌ ఇంటి నియమాలు పాటించడంలో అంతా విఫలమయ్యారని మండిపడ్డారు. కెప్టెన్లు తమ కర్తవ్యాన్ని మరిచారని, ఇంట్లోని పరిసరాలన్నింటినీ శుభ్రం చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఎవరు నిబంధనను ఉల్లంఘించినా కెప్టెన్ సొహైల్ వెళ్లి అన్ని కెమెరాల దగ్గర క్షమాపణ కోరాలని బిగ్‌బాస్ చెప్పారు. ఇక నిన్న జరిగింది చూస్తుంటే.. మళ్లీ ట్రయాంగిల్ స్టార్ట్ అయ్యిందా? అనిపించింది. కానీ అఖిల్ మాత్రం మోనాల్‌ని బెస్ట్ ఫ్రెండ్‌గా చెప్పాడు.

ఇక టాస్క్‌ పూర్తైన తరువాత నాగ్ కంటెస్టెంట్ల ముందుకు వెళ్లారు. సొహైల్‌కి కంగ్రాట్స్ చెప్పి.. అఖిల్, అభిజిత్‌లతో క్లాస్‌ స్టార్ట్ చేశారు. మోనాల్‌ను మధ్యలోకి ఎందుకు తీసుకు వచ్చారని ఆయన వాయించారు. ఎవరు ఎవరినైనా నామినేట్ చేసుకోవాలని కానీ.. మధ్యలోకి వేరే ఏ వ్యక్తినైనా తీసుకు రావాలంటే వాళ్ల పర్మిషన్ తీసుకోవాలని నాగార్జున చెప్పారు. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తరువాత మోనాల్‌ని అఖిల్, అభిలలో ఎవరిది తప్పని అడగ్గా.. ఇద్దరిదీ తప్పని ఆమె చెప్పింది. కానీ మోనాల్ తనతో అఖిల్‌ది తప్పని చెప్పిందని అభి చెప్పాడు. తరువాత నోయెల్‌ని గతవారం స్వాతిని నామినేట్‌ చేశాడని, అమ్మ రాజశేఖర్ నామినేట్ చేశావు. మరి కుమార్ సాయిని నువ్వు నామినేట్ చేశావు కదా. అప్పుడు నీకది గుర్తు రాలేదా..? అని అడిగారు.

ఆ తరువాత అమ్మ రాజశేఖర్‌ని నోయెల్ వచ్చి సారీ చెబుతుంటే ఎందుకు అసలు వినలేదు అని ప్రశ్నించారు. అందుకు అమ్మ రాజశేఖర్ వివరణ ఇస్తుంటే నాగ్ వినలేదు. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది..? అని లాజికల్‌గా అమ్మ రాజశేఖర్‌ని కడిగేశారు. నెక్ట్స్ సొహైల్‌తో మాట్లాడుతూ.. దివిపై ఆ అరుపేంటని? ఆ పిచ్ ఏంటని? ఒక పిచ్చి కుక్కలా అరుస్తున్నాడనిపిస్తోందంటూ వాయించేశారు. ఇంకోసారి ఆడపిల్లపై అరుస్తే కొరడా ఝుళిపించాల్సి వస్తుందంటూ నాగ్ హెచ్చరించారు. తరువాత అవినాష్ దగ్గరకు వచ్చి దివి నడకను ఇమిటేట్ చేసి చూపించామని కోరగా అవినాష్‌ చూపించాడు. నీ సీక్రెట్ టాస్క్ సక్సెస్ చేసుకోవడం కోసం మిగలిన వారిని బలి చేస్తావా..? అంటూ ఫన్నీగా అడిగారు. ఆ తరువాత అవినాష్‌కి హాట్సాఫ్ చెప్పారు. ఇక ఆట ఆగిపోవడానికి కారణం అభిజిత్ అని నాగ్ చెప్పారు.

సర్వీస్ చేసి స్టార్స్ తీసుకోవాలని బిగ్‌బాస్ క్లియర్‌గా చెప్పాడని, మీరు ఓడిపోవడానికి కారణం హారిక అని నాగ్ చెప్పారు. టీమ్ వర్క్ చేయలేదని అందుకే ఓడిపోయారని నాగ్ చెప్పారు. మాట్లాడితే నీ ఎడ్యుకేషన్ తీస్తున్నావని, ఎడ్యుకేషన్ లేని వాళ్లు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారని.. అసలు చదువు అనే దాన్ని మనసు నుంచి తీసేయాలని, అది వాడొద్దని నాగ్ స్పష్టం చేశారు. ఇక మెహబూబ్ వద్దకు వచ్చి.. పుచ్చె పగిలిపోతుందా..? ఏం మాట అది..? అని ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. లాంగ్వేజ్ మార్చుకోమని సూచించారు. ఇక నామినేషన్‌లో ఉన్న తొమ్మిది మందిని నిలబెట్టి 8 కోట్ల ఓట్లు వచ్చాయని నాగ్‌ చెప్పారు. తరువాత సొహైల్‌ని నామినేషన్ నుంచి నాగార్జున సేవ్ చేశారు.

Read More:

Bigg Boss 4: గంగవ్వ కోరిక.. నేను తీరుస్తానంటూ నాగ్ హామీ

Bigg Boss 4: గంగవ్వ గుడ్‌బై‌.. ఏడ్చేసిన కుటుంబ సభ్యులు

Follow Us