Bigg Boss 4: చనిపోయిన నా బిడ్డను భుజంపై వేసుకొని వెళ్లా.. ఏడ్చేసిన గంగవ్వ

| Edited By:

Oct 10, 2020 | 10:35 AM

బిగ్‌బాస్‌ 4 శుక్రవారం నాటి ఎపిసోడ్‌ స్టార్ట్ అయిన తరువాత ఎమోషనల్‌గా గడిచింది. ఇంటి సభ్యులంతా ఎమోషనల్ స్పీచ్‌లు ఇచ్చారు.

Bigg Boss 4: చనిపోయిన నా బిడ్డను భుజంపై వేసుకొని వెళ్లా.. ఏడ్చేసిన గంగవ్వ
Follow us on

Bigg Boss 4 Gangavva: బిగ్‌బాస్‌ 4 శుక్రవారం నాటి ఎపిసోడ్‌ స్టార్ట్ అయిన తరువాత ఎమోషనల్‌గా గడిచింది. ఇంటి సభ్యులంతా ఎమోషనల్ స్పీచ్‌లు ఇచ్చారు. మొదట నోయెల్‌, తన తల్లి గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నానంటే అది నా ఫ్రెండ్ వలన.. అది ఎవరో కాదు మా అమ్మ అంటూ నోయెల్‌ చెప్పాడు. ఇక నోయెల్‌ అలా చెప్పేసరికి లాస్య కన్నీళ్లు పెట్టుకుంది. ”నేను అమ్మను అయ్యే వరకు కూడా నాకు అమ్మ విలువ తెలీదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాకు నార్మల్ డెలివరీ. 14 గంటలు నొప్పులు భరించిన తరువాత నా కొడుకు నా చేతుల్లోకి వచ్చాడు. వాడిని చూడగానే నేను పడ్డ బాధంతా మరిచిపోయా. ఆ మదర్ హుడ్‌ని చాలా ఎంజాయ్ చేశా” అని లాస్య చెప్పుకొచ్చింది.

ఇక గంగవ్వ మాట్లాడుతూ.. నాకు 5 ఏళ్లకే పెళ్లి చేశారు. ఏం చదువుకోలేదు. 15 ఏళ్లకు కొడుకు పుట్టాడు. తరువాత రెండేళ్లకు కూతురు పుట్టింది.. ఆ సమయంలో మస్కట్‌కి పోతానని డబ్బులు తెమ్మన్నాడు. దెబ్బలైనా తప్పుతాయని నేను సరేనని చెప్పా. అదే సమయంలో కూతురికి ఫిట్స్ వచ్చాయి. ఎత్తుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లా. డాక్టర్లు చూసి నీ బిడ్డ చనిపోయిందని అన్నారు. చ‌నిపోయిన బిడ్డ‌తో బ‌స్సులో ఎక్క‌బోతే వాళ్ళు ఎక్క‌నివ్వ‌లేదు. ఆటోలో ఇంటి‌కి తీసుకొచ్చా. అప్ప‌టి నుండి అన్నం కూడా స‌రిగా లోప‌లికి పోత‌లేదు. నా కొడుకు మందుకు బానిసయ్యాడు’ అని ఏడ్చేసింది. దీంతో హౌజ్‌లో ఉన్న అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Read More:

Bigg Boss 4: లాక్‌డౌన్‌లో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా: అవినాష్

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..