Bigg Boss 4 Akhil Abhijeet: బిగ్‌బాస్ 4వ సీజన్‌లో బద్ధ శత్రువులు అంటే వెంటనే ఎవరికైనా అఖిల్, అభిజిత్‌లు గుర్తొస్తారు. హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో వీరిద్దరి మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ.. మోనాల్ విషయంలో ఇద్దరి మధ్య క్లాష్ వచ్చింది. మోనాల్‌ని ఇద్దరు ఇష్టపడుతూ ఉండటంతో తెలీకుండానే వీరి మధ్య శత్రుత్వం మొదలైంది. దీంతో ప్రత్యేక కారణాలు లేకపోయినా ప్రతి వారం ఎలిమినేషన్ నామినేషన్‌లో ఒకరినొకరు నామినేట్ చేసుకునేవారు. అంతేకాదు మామూలుగా మాట్లాడుకునేందుకు కూడా వీరిద్దరు పెద్దగా ఆసక్తిని చూపేవారు కాదు.
కానీ రోజులు గడుస్తున్న కొద్ది ఈ ఇద్దరిలో మార్పు వస్తున్నట్లు తెలుస్తోంది. మోనాల్‌కి అభిజిత్ దూరంగా వెళ్లాడు. ఆ కారణమో, ఇంకొక కారణమో తెలీదు గానీ.. అఖిల్, అభికి దగ్గరవుతున్నాడు. గత వారంలో జరిగిన బిగ్‌బాస్ బీబీ బ్లాక్‌బస్టర్ మూవీ డిస్కషన్ సమయంలో అభి పట్ల అవినాష్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. అఖిల్, అభికి సపోర్ట్ చేశాడు. ఇక సోమవారం ఎలిమినేషన్‌కి నామినేషన్ జరిగే సమయంలోనూ అఖిల్, అభి ఇద్దరు వేరే వారిని ఎంపిక చేశారు. అలాగే మార్నింగ్ మస్తీలో భాగంగా అభి గురించి అఖిల్ పాజిటివ్‌గా రాశారు. తనతో మాట్లాడుతున్నప్పుడు బాగా కనిపిస్తావు, కానీ డైటింగ్ మానేసి తినడం మొదలెట్టు అని అఖిల్ రాశాడు. ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలైనట్లు అర్థమవుతోంది.
Read More: