Bigg Boss Avinash: బిగ్‌బాస్ 4లో ఈ వారం ఎలిమినేషన్‌కి గానూ మొత్తం నలుగురు ఎన్నికయ్యారు. వారిలో అవినాష్, అఖిల్, మోనాల్, అరియానా ఉన్నారు. వీరిలో శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున, మోనాల్‌ని సేవ్ చేశారు. ఇక మిగిలిన వారిలో అరియానా, అవినాష్, అఖిల్‌లు ఉన్నారు. అయితే ఈ వారం ప్రారంభంలో అవినాష్‌కి ఎవిక్షన్ పాస్ లభించింది. దీని వాలిడిటీ రెండు వారాల పాటు ఉండనుంది. ఇక ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే దాన్ని తెలివిగా అవినాష్ ఈ వారమే వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇక అరియానా, అఖిల్ ఇద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లు కాగా.. వారిలో ఒకరిని బయటకు పంపడం ఇష్టం లేక.. ఈ వారం ఎలిమినేషన్‌ని తీసేసినట్లు తెలుస్తోంది.
కాగా ఎలిమినేషన్ అంటే ముందు నుంచి బయపడుతూ వస్తున్నాడు అవినాష్. అసలు ఎలిమినేషన్ నామినేషన్‌లో తన పేరు ఎవరైనా చెబితే చాలు అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో అందరికీ పోటీని ఇస్తూ టాప్‌లో ఉన్న ఈ కమెడియన్.. ఆ తరువాత మాత్రం సింపథీ గేమ్ ఆడుతూ వచ్చాడు. తాను జబర్దస్త్‌ని వదులుకొని వచ్చానని, అన్నీ కోల్పోయానని, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని అవినాష్ చెప్పే మాటలు ప్రేక్షకులను పెద్దగా నచ్చలేదు. దీంతో అవినాష్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో పాటు నెగిటివిటీ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అతడికి తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఇక ఈసారి ఎవిక్షన్ పాస్‌ని వాడుకొని తప్పించుకున్నా.. మళ్లీ నామినేషన్‌లో ఉంటే మాత్రం అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని వీక్షకులు అంటున్నారు. మరి ఇప్పటికైనా తన సింపథీ గేమ్‌ని పక్కనపెట్టి, అవినాష్ ఆటను ఆడితే టాప్ 5కి చేరే అవకాశాలు చాలా ఉన్నాయంటున్నారు బిగ్‌బాస్ ప్రేక్షకులు. చూడాలి మరి త్వరలో ముగియనున్న ఈ షో విజేతగా ఎవరు నిలుస్తారన్నది.