Avinash new Captain: బిగ్‌బాస్‌లో గురువారం నాటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ టాస్క్ కింద బండి తోయరా బాబు అన్న టాస్క్‌ని బిగ్‌బాస్ అరియానా, అవినాష్‌కి ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా ఇద్దరికీ గార్డెన్ ఏరియాలో చెరో స్టేషన్‌తో పాటు రెండు ట్రాలీలు ఇచ్చారు. బజర్ మోగే సమయానికి ఏ పోటీదారుడు అయితే ట్రాలి సహాయంతో తమ స్టేషన్‌లో ఎక్కువ మంది సభ్యులను ఉంచగలుగుతారో వారే ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్‌బాస్ వెల్లడించాడు. అయితే ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులను ఒప్పించే.. పోటీదారుడు తమ ట్రాలీలో ఎక్కుంచుకుని స్టేషన్‌కు తరలించాలని సూచించాడు.
ఇక ఈ పోటీలో అవినాస్, అరియానా చాలా కష్టపడ్డారు. ఇలా ఇద్దరు చెరో ఐదుగురిని తమ స్టేషన్లలో ఉంచారు. దీంతో పోటీ టైగా మారింది. అప్పుడు బిగ్‌బాస్ మరో అవకాశం ఇచ్చారు. అవతల స్టేషన్‌లో ఉన్న సభ్యులను ఒప్పించి తమ స్టేషన్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చని సూచించారు. ఈ క్రమంలో అరియానా, అవినాష్ మళ్లీ గట్టిగా పోటీ పడ్డారు. మోనాల్, అమ్మ రాజశేఖర్, నోయల్ తమ స్టేషన్‌ల నుంచి అవతల స్టేషన్‌కు వెళ్లి.. మళ్లీ మనసు మార్చుకుని తమ స్థానానికి వచ్చేశారు.
కానీ చివర్లో అరియానా స్టేషన్‌లో ఉన్న మోనాల్, అవినాష్ స్టేషన్‌లోకి వెళ్లడంతో అతడికి ఆరుగులు సభ్యులయ్యారు. ఇక అవినాష్ టీమ్‌లో ఉన్న అమ్మ రాజశేఖర్, లాస్య, అభిజీత్, అఖిల్, సోహెల్, మోనాల్ ఉండగా.. వారిలో ఎవ్వరూ అరియానా స్టేషన్‌లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో చివరకు అవినాష్ కెప్టెన్‌గా గెలిచాడు. ఇక ఓడిపోవడంతో అరియానా కాస్త ఫీల్ అయ్యింది. ఏడ్చేసింది. దీంతో దివి, ఆమెను ఓదార్చింది.
Read More: