Bigg Boss 4: హారిక మాటను గుర్తుపెట్టుకున్న అవినాష్‌.. అరియానాకు పోస్ట్‌

బిగ్‌బాస్‌ 4లో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా అవినాష్‌, అరియానా పోటీ పడగా.. అవినాష్‌ గెలిచాడు. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక

Bigg Boss 4: హారిక మాటను గుర్తుపెట్టుకున్న అవినాష్‌.. అరియానాకు పోస్ట్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 23, 2020 | 8:09 AM

Bigg Boss 4 Avinash: బిగ్‌బాస్‌ 4లో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా అవినాష్‌, అరియానా పోటీ పడగా.. అవినాష్‌ గెలిచాడు. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక, అవినాష్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఒక అమ్మాయి బిగ్‌బాస్ కెప్టెన్‌ అవ్వలేదన్న హారిక మాటను దృష్టిలో పెట్టుకున్న అవినాష్‌.. తనతో పోటీ పడిన అరియానాకు రేషన్ మేనేజర్ పోస్ట్‌ని ఇచ్చాడు. ఇక అవినాష్‌ ఈ నిర్ణయంతో ఇంటి సభ్యుల మనసులు కూడా గెలుచుకున్నాడు. మరోవైపు అవినాష్‌ నిర్ణయంపై అరియానా కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఇక కెప్టెన్‌గా గెలిచిన సమయంలో తనతో పాటు అరియానా కూడా కెప్టెన్ అయినట్లేనని వెల్లడించి అందరి మన్ననలు పొందాడు.

Read More:

Bigg Boss 4: అరియానాకు హౌజ్‌మేట్స్‌ హ్యాండ్‌.. కెప్టెన్‌గా అవినాష్‌

ముంబై సిటీసెంటర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం