ముంబై సిటీసెంటర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం

ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ముంబైలోని సిటీసెంటర్ మాల్ లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.

  • Balaraju Goud
  • Publish Date - 7:38 am, Fri, 23 October 20

ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ముంబైలోని సిటీసెంటర్ మాల్ లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. కింది అంతస్తులో రాజుకున్న మంటలు అంతటా వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన 20 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం జరిగినపుడు సిటీసెంటర్‌మాల్ లో 300 మంది దాకా ఉన్నారని పోలీసులు తెలిపారు. మంటలను ఆర్పుతుండగా ఓ ఫైర్ మెన్ తీవ్రంగా గాయపడ్డారు.

మొదటి అంతస్థులో చెలరేగిన మంటలు మూడు అంతస్తుల వరకూ వేగంగా వ్యాపించాయ్‌. ముందుజాగ్రత్త చర్యగా సిటీసెంటరు మాల్ చుట్టుపక్కల ఉన్న భవనాలను ఖాళీ చేయించారు అధికారులు. సిటీసెంటరు మాల్ లో ఉన్న 300మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తెల్లవారుజాము వరకూ మంటలు అదుపులోకి రాలేదు.ఈ మాల్ లో మొబైల్ ఫోన్ల యాక్ససరీలు విక్రయిస్తుంటారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. భారీగానే ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు.